|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుమ స్థానానికి ఎసరు పెట్టిన లేడీ యాంకర్ ఎవరో తెలుసా, అనసూయ కాదు.. ఆమె తప్పుకోవడం నా అదృష్టం అంటూ కామెంట్స్

Published: 23-10-2025, 9:01 AM
సుమ స్థానానికి ఎసరు పెట్టిన లేడీ యాంకర్ ఎవరో తెలుసా, అనసూయ కాదు.. ఆమె తప్పుకోవడం నా అదృష్టం అంటూ కామెంట్స్

టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల దశాబ్దాలుగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అయితే ఒకప్పుడు తన స్థానానికి ఎసరు పెట్టిన లేడీ యాంకర్ గురించి సుమ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. అనసూయ కాదు, కలర్స్ స్వాతి వల్ల భయపడ్డానని, ఆమె నటిగా మారడం తన అదృష్టమని సుమ వ్యాఖ్యానించారు.

Key Points

1

యాంకర్ సుమ కనకాల టాలీవుడ్‌లో దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

2

ఒకప్పుడు సుమకు బలమైన పోటీ ఇచ్చిన యాంకర్ కలర్స్ స్వాతి అని వెల్లడైంది.

4

స్వాతి నటిగా మారడం తన అదృష్టమని, లేదంటే తనకు పోటీ అయ్యేదని సుమ వ్యాఖ్యానించారు.

టాలీవుడ్‌లో సుమ కనకాల అగ్రస్థానం

టాలీవుడ్ లో టాప్ యాంకర్ ఎవరంటే వెంటనే సుమ కనకాల పేరు చెబుతారు. ఆ తర్వాత శ్రీముఖి, యాంకర్ రవి, ప్రదీప్ మాచిరాజు ఉంటారు. అనసూయ, శ్యామల గతంలో యాంకర్లుగా రాణించారు. కానీ ప్రస్తుతం యాంకరింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. సుమ కనకాల మాత్రం దశాబ్దాలుగా యాంకర్ గా దూసుకుపోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, టీవీ ప్రోగ్రామ్స్ లో ఆమె హవానే కనిపిస్తూ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సుమ యాంకరింగ్ ఒక సెంటిమెంట్ లా మారిపోయింది.

యాంకర్ గా అగ్ర స్థానంలో ఉన్న సుమ ఒకప్పుడు తనకి కాంపిటీషన్ గా ఉన్న మరో యాంకర్ ని చూసి భయపడిందట. ఆమె ఎక్కడ తన స్థానానికి ఎసరు పెడుతుందో అని టెన్షన్ పడిందట. ఆమె యాంకరింగ్ అంటే తనకి కూడా చాలా ఇష్టం అని సుమ తెలిపింది. సుమ చెబుతున్నది నటి స్వాతి రెడ్డి గురించి. నటి స్వాతి కలర్స్ స్వాతిగా గుర్తింపు పొందింది.

సుమకు పోటీగా కలర్స్ స్వాతి ఎందుకు నిలిచింది?

కెరీర్ బిగినింగ్ లో తన అద్భుతమైన వాయిస్, క్యూట్ లుక్స్ తో యువతని బాగా ఆకర్షించింది. మహేష్ బాబు లాంటి స్టార్లని సైతం ఇంటర్వ్యూలు చేసింది. టీవీ ప్రోగ్రామ్స్ లో ఆమె యాంకరింగ్ స్టైల్ ప్రతి ఒక్కరినీ మెప్పించేది. సుమ మాట్లాడుతూ.. స్వాతి నాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఆమెకి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చిన్న పెద్ద అని తేడా లేదు.. ఎవరితో అయినా చాలా సరదాగా మాట్లాడేసేది అని స్వాతిపై సుమ ప్రశంసలు కురిపించారు.

ఇదే జోరు కొనసాగిస్తే స్వాతి తప్పకుండా నాకు పోటీ అవుతుందని అనుకున్నా. లక్కీగా స్వాతికి హీరోయిన్ గా ఛాన్సులు రావడంతో యాంకరింగ్ వదిలేసింది అని సుమ పేర్కొంది. వెంకటేష్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో స్వాతి పోషించిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత అష్టాచమ్మా చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

స్వాతి కెరీర్ మలుపు: సుమ వ్యాఖ్యలు

అక్కడి నుంచి స్వాతి కెరీర్ మలుపు తిరిగింది. స్వామి రా రా, కార్తికేయ లాంటి హిట్ చిత్రాల్లో స్వాతి హీరోయిన్ గా నటించింది. ఇటీవల స్వాతికి అవకాశాలు తగ్గాయి. సుమ మాత్రం యాంకర్ గా ఇంకా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.

సుమ చేసిన ఈ వ్యాఖ్యలు కలర్స్ స్వాతి ప్రతిభను, సుమ ప్రొఫెషనల్ జర్నీని స్పష్టం చేస్తున్నాయి. స్వాతి నటన వైపు వెళ్లినా, సుమ మాత్రం తన అగ్రస్థానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ పోటీ ఆనాటి సినీ లోకంలో ఆసక్తిని రేపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.