
📌 Key Points
- నటుడు శివాజీ ‘దండోరా’ ఈవెంట్ లో హీరోయిన్ల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
- శివాజీ వ్యాఖ్యలపై మంచు మనోజ్, అనసూయ, చిన్మయి వంటి సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- యాంకర్ సుమ ‘ఎకో’ సినిమా ప్రస్తావనతో శివాజీ వ్యాఖ్యలను పరోక్షంగా విమర్శించింది.
- “ఇలాంటి నీచులను వదిలేస్తే ఇంకా పెంచి పోషించడమే అవుతుంది” అంటూ సుమ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపాయి. పలువురు సెలబ్రిటీలు ఆయన్ను తప్పుబట్టగా, తాజాగా యాంకర్ సుమ కూడా ఘాటుగా స్పందించింది. ‘ఇలాంటి నీచులను వదిలేస్తే పెంచి పోషించడమే’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు శివాజీని ఉద్దేశించేనా అని చర్చ నడుస్తోంది.
శివాజీ వ్యాఖ్యలపై దుమారం
‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు ధరించే అర్ధనగ్న దుస్తులపై నటుడు శివాజీ(Shivaji) చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపాయి. సినీ సెలబ్రిటీలే ఆయన వైఖరిని తప్పు బడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించారంటూ ఆయనపై మండిపడుతున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, అనసూయ, సింగర్ చిన్మయి ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహిళా సీరియస్ అవడంతో పాటు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడి బాధపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముందుగా దీనికి శివాజీ ఒప్పుకోనప్పటికీ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో క్షమాపణ కోరుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఆ వివాదానికి కాస్త చెక్ పడిందనుకుంటే.. ఈ విషయంపై సినీ సెలబ్రిటీలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ఆయన చేసిన మాటలు మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో మహిళా నటీమణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా, ఈ విషయంపై యాంకర్ సుమ(Suma) ,శివాజీ తీరును తప్పుపట్టింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ నోట్ విడుదల చేసింది. ఇటీవల నేను ఎకో అనే సినిమాను చూశానని చెప్పింది. సినీ ఇండస్ట్రీలో నిధి అగర్వాల్, సమంతకు జరిగిన సంఘటనలు మనకు హెచ్చిరికలాంటివని పేర్కొన్నారు. ఇలాంటివి చూస్తుంటే మహిళలకు భద్రత, గౌరవం ఎక్కడుందనిపిస్తోందని? ప్రశ్నించారు. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని, అవమానించే నీచులను వదిలేయడం అంటే ఇంకా వారిని పెంచి పోషించడమే అవుతుందని ఫైర్ అయ్యారు. మహిళలకు రక్షణ కల్పించడం.. ఆంక్షలు పెట్టడం ఒక్కటి కాదని పేర్కొంది. మహిళలను వేధింపులకు గురిచేయడంతో పాటు అవమానించడం సరికాదని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇవి శివాజీని ఉద్దేశించే చెప్పిందనే చర్చ మొదలైంది. link
సుమ సంచలన పోస్ట్
“నీచులను” అంటూ సుమ సందేశం
మహిళలను కించపరిచే వ్యాఖ్యలపై సుమ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు శివాజీ వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చాయి. ఈ వివాదంపై మరిన్ని స్పందనలు ఎలా ఉంటాయో చూడాలి.


