|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి షాకింగ్ రాజీనామా! అసలు కారణం ఇదేనా?

Published: 20-05-2026, 4:45 AM
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి షాకింగ్ రాజీనామా! అసలు కారణం ఇదేనా?
  • సునీల్ నారంగ్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
  • వ్యక్తిగత కారణాలు చెప్పినా, థియేటర్ల-నిర్మాతల వివాదమే అసలు కారణమని టాక్.
  • ఏషియన్ సినిమాస్ అధినేతగా ఆయనపై ఒత్తిడి పెరిగిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
  • ఈ నెల 22న కొత్త అధ్యక్షుడి ఎన్నికకు అత్యవసర సమావేశం జరగనుంది.

తెలంగాణ చిత్ర పరిశ్రమలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు చెప్పినప్పటికీ, థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య నడుస్తున్న వివాదాలే దీనికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

రాజీనామా వెనుక అసలు కారణం?

Suniel Narang: తెలంగాణ చిత్ర పరిశ్రమలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఛాంబర్‌కు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు. అయితే, గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో నడుస్తున్న వివాదాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read also- బాలయ్య బాబు ‘NBK111’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్‌గా మంచు మనోజ్..

థియేటర్ల వివాదమే ప్రధానమా?

ఈ రాజీనామాకు వ్యక్తిగత కారణాలని చెప్తున్నప్పటికీ, గత కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య జరుగుతున్న “పర్సంటేజీ/కమిషన్” వివాదమే ఈ రాజీనామాకు ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. అంతే కాకుండా మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు వసూలు చేస్తున్న పర్సంటేజీలు, విపిఎఫ్ (VPF) ఛార్జీల వల్ల తాము భారీగా నష్టపోతున్నామని కొందరు నిర్మాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏషియన్ సినిమాస్ అధినేతగా, పెద్ద సంఖ్యలో థియేటర్ల నెట్‌వర్క్ ఉన్న సునీల్ నారంగ్ వైపే ఈ వివాదంలో వేళ్లు చూపించాయి. ఛాంబర్ అధ్యక్షుడిగా ఉంటూ నిర్మాతలకు న్యాయం చేయడం లేదనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ ఒత్తిడి వల్లే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Read also- Illu Illaalu pillalu : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. కొత్త సీరియల్ స్టార్ట్..

తదుపరి అధ్యక్షుడు ఎవరు? భవిష్యత్తు కార్యాచరణ

సునీల్ నారంగ్ రాజీనామాను ఫిలిం ఛాంబర్ కార్యవర్గం ఆమోదించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఛాంబర్ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఈనెల 22న తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ కార్యవర్గం అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా గానీ, లేదా కమిటీ సభ్యుల మద్దతుతో గానీ ఎన్నుకోనున్నారు. సునీల్ నారంగ్ లాంటి సీనియర్, పట్టున్న వ్యక్తి తప్పుకోవడంతో, రాబోయే రోజుల్లో థియేటర్ల వర్సెస్ నిర్మాతల వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. నూతనంగా ఎన్నికయ్యే అధ్యక్షుడు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారనే దానిపైనే టాలీవుడ్ భవిష్యత్తు వ్యాపార సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి. దీని గురించి మరితం సమాచారం తెలియాల్సి ఉంది.

సునీల్ నారంగ్ రాజీనామాతో టాలీవుడ్‌లో థియేటర్ల-నిర్మాతల వివాదం కొత్త మలుపు తిరిగింది. నూతన అధ్యక్షుడి ఎన్నిక, ఆయన సమస్యల పరిష్కారంపైనే చిత్ర పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.