|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూపర్‌ స్టార్‌ కృష్ణతో వాణిశ్రీకి ఉన్న గొడవేంటి? 30ఏళ్ల తర్వాత ఫోన్‌ చేస్తే మొహం మీదే నో చెప్పిన స్టార్‌ హీరోయిన్‌

Published: 07-10-2025, 12:48 PM
సూపర్‌ స్టార్‌ కృష్ణతో వాణిశ్రీకి ఉన్న గొడవేంటి? 30ఏళ్ల తర్వాత ఫోన్‌ చేస్తే మొహం మీదే నో చెప్పిన స్టార్‌ హీరోయిన్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ, అలనాటి తార వాణిశ్రీల మధ్య గొడవ ఏంటి? దాదాపు 20కి పైగా చిత్రాలలో కలిసి నటించినా వారు ఎందుకు మాట్లాడుకోలేదు? 30 ఏళ్ల తర్వాత వాణిశ్రీ స్వయంగా ఓపెన్ హార్ట్ షోలో వెల్లడించిన ఆ ఆసక్తికర రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Key Points

1

సూపర్‌ స్టార్‌ కృష్ణ భోళా మనిషి, లోపల ఏదీ దాచుకోరని ఇండస్ట్రీలో పేరుంది.

2

కృష్ణ, వాణిశ్రీ 20కి పైగా సినిమాల్లో కలిసి నటించినా ఎప్పుడూ మాట్లాడుకోలేదట.

4

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో వాణిశ్రీ ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు.

కృష్ణ వ్యక్తిత్వం – వాణిశ్రీ వెల్లడి

సూపర్‌ స్టార్‌ కృష్ణ భోళా మనిషి, లోపల ఏదీ ఉంచుకోరు, మొహం మీదనే అనేస్తారనే కామెంట్‌ ఇండస్ట్రీలో ఉంది. ఆయనతో పనిచేసిన చాలా మంది ఈ విషయాన్ని చెప్పారు. తన సినిమా పోయినా కూడా ఓపెన్‌గా చెబుతారని, అందులో దాపరికం ఉండదని అంటుంటారు. ఏ గొడవైనా అప్పటికప్పుడు క్లీయర్‌ చేస్తారని అంతా చెబుతారు. కానీ ఓ స్టార్‌ హీరోయిన్‌ విషయంలో మాత్రం కృష్ణ చాలా బెట్టు చేశాడట. కనీసం ఆమెతో మాట్లాడలేదట. అసలు ఎలాంటి గొడవే లేకుండా హీరోయిన్‌తో మాట్లాడలేదట. కెరీర్‌ మొత్తంలో ఆమెని దూరం పెట్టాడట. ఆ హీరోయిన్‌ ఎవరో కాదు అలనాటి తార వాణిశ్రీ. అప్పట్లో సావిత్రి తర్వాత తెలుగు సినిమాని ఓ ఊపు ఊపేసిన నటి ఆమె. ఇంకా చెప్పాలంటే సావిత్రి సినిమాలు మానేశాక వాణిశ్రీ సినిమా ఇండస్ట్రీని రూల్ చేసిందని చెప్పొచ్చు.

వాణిశ్రీ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతోపాటు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌ బాబు వంటి వారితో కలిసి నటించారు. వారికి అప్పట్లో వాణిశ్రీ బెస్ట్ ఆప్షన్‌గా ఉండేది. అద్భుతమైన నటి కూడా. అందుకే ఆమె కోసం స్టార్స్ కూడా వెయిట్‌ చేసేవారు. ఈ టాప్‌ హీరోలందరితోనూ వాణిశ్రీ పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. అలా సూపర్‌ స్టార్‌ కృష్ణతో కూడా చాలా సినిమాలే చేశారు. వీరి కాంబోలో ఇరవైకి పైగానే సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఈ జంటని అత్యంత సక్సెస్‌ఫుల్‌ జోడీగా పిలిచేవారు. అయితే వీరి కాంబినేషన్‌లో ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్ రూపొందాయి. వాటిలో కొన్ని పరాజయం చెందితే, కొన్ని మంచి ఆదరణ పొందాయి. `మహాబలుడు`, `మరుపురాని కథ`, `కన్నె మనసులు`, `జగత్‌ ఖిలాడీలు`, `చీకటి వెలుగులు`, `స్త్రీ జన్మ`, `అసాధ్యుడు`, `పచ్చని సంసారం` వంటి చిత్రాలు బాగానే ఆడాయి.

కృష్ణ, వాణిశ్రీల మధ్య మౌనం

అయితే కృష్ణ, వాణిశ్రీ కలిసి దాదాపు ఇరవై సినిమాలు చేసినా ఏ రోజు కూడా మాట్లాడుకోలేదట. కనీసం సెట్‌లో హాయ్‌.. భాయ్‌ కూడా లేదట. తనని ఆయన పట్టించుకునేవారు కాదు, తాను ఆయన్ని పట్టించుకునేదాన్ని కాదు అని తెలిపారు వాణిశ్రీ. ఏబీఎన్‌ రాధాకృష్ణకి ఇచ్చిన ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. మీ నటన గురించి ఎవరు ఎక్కువగా ప్రశంసించేవారు ఆయన అడగ్గా, ఒక్క ఎన్టీఆర్‌ తప్ప తన నటన గురించి ఎవరూ పొగడ లేదని తెలిపారు వాణిశ్రీ. ఎన్టీఆర్‌తోపాటు కృష్ణంరాజు అప్పుడప్పుడు ప్రశంసించేవారట. కానీ ఏఎన్నార్‌, కృష్ణ ఎప్పుడూ బాగా చేశావని, బాగున్నావనిగానీ అనలేదట. ఏఎన్నార్‌తో ఏజ్‌ గ్యాప్‌ ఉంది కావచ్చు. వాళ్లంతా పెద్ద స్టార్స్ కావచ్చు, ఈ చిన్న పిల్లతో ఏముందిలే అనుకోవచ్చు. కారణం ఏదైనా తనని అభినందించలేదని వెల్లడించారు వాణిశ్రీ. ఈ క్రమంలోనే సూపర్‌ స్టార్‌ తో తనకు పడని విషయాన్ని బయటపెట్టారు.

కృష్ణతో కలిసి ఎన్నో సినిమాలు చేశాం. దర్శకుడు షాట్‌ చెప్పినట్టు చేసేవాళ్లం. కానీ ఏనాడూ ఆయన తనని విష్ చేయలేదని, తాను ఆయన్ని విష్‌ చేయలేదని, వచ్చామా? షూటింగ్‌ చేశామా? వెళ్లిపోయామా? అనేలా తమ మధ్య షూటింగ్‌ జరిగిందని తెలిపారు వాణిశ్రీ. అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు, మనస్పర్థాలు లేవు, బేధాభిప్రాయాలు లేవు. కానీ ఒక్క సారి కూఆ మాట్లాడుకోలేదని తెలిపారు వాణిశ్రీ. కృష్ణ చాలా మంచి వారని, అందరిని బాగా చూసుకుంటారని, తన సినిమాల కలెక్షన్ల లెక్కలు కూడా ఆయన మైండ్‌లో ఉంటాయని, వ్యక్తిగా చాలా గొప్ప మనిషి అని, కానీ తన విషయంలో మాత్రం ఎందుకో ఆ గ్యాప్‌ ఉండేదని తెలిపారు వాణిశ్రీ.

వాణిశ్రీ ఓపెన్ హార్ట్ షోలో చెప్పిన నిజాలు

ఈ క్రమంలో దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఒక రోజు తనకు ఫోన్‌ చేశాడట కృష్ణ. ఓ మూవీ లో నటించాలని అడిగారట. అందులో సవతి తల్లిగా నటించాలని అడిగాడట కృష్ణ. సినిమాలో ఆమె పాత్ర చివర్లో హీరోకి విషం ఇచ్చి చంపుతుంది. ఈ విషయం చెప్పాక ఆ సినిమా చూసిందట వాణిశ్రీ. చూశాక తాను ఈ మూవీ చేయలేనని, ఇలాంటి పాత్ర తనకు వద్దు అని మొహం మీదనే చెప్పేసిందట. మూడు నాలుగు సార్లు కృష్ణ అడిగినా వాణిశ్రీ నో చెప్పిందట. అలా ఆ ఒక్కసారి మాత్రమే తనతో కృష్ణ మాట్లాడారని, అది తప్ప ఇప్పటి వరకు మాట్లాడలేదని తెలిపింది వాణిశ్రీ. ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. మరి వాణిశ్రీతో కృష్ణకి ఇబ్బంది ఏంటి? వారి మధ్య ఏం జరిగిందనేది మాత్రం పెద్ద సస్పెన్స్.

మొత్తానికి, కృష్ణ భోళా మనిషి అని పేరున్నా, వాణిశ్రీ విషయంలో ఆయన మౌనం, అలాగే వాణిశ్రీ సైతం దూరంగా ఉండటం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా ఉండేది. ఈ విషయాలను వాణిశ్రీ ఇన్నేళ్ల తర్వాత పంచుకోవడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.