
📌 Key Points
- సురేఖ వాణి కూతురు సుప్రీత వస్త్రధారణపై స్పందించారు.
- శివాజీ చేసిన వ్యాఖ్యలను సుప్రీత సమర్థించారు.
- సందర్భాన్ని బట్టి వస్త్రధారణ ఉండాలని సుప్రీత అభిప్రాయపడ్డారు.
- శివాజీ వాడిన పదాలు తప్ప ఆయన చెప్పింది నిజమేనని సుప్రీత అన్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కుమార్తె సుప్రీత తాజాగా వస్త్రధారణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు శివాజీ అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడిన మాటలలో నిజం ఉందని ఆమె అన్నారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సుప్రీత షాకింగ్ కామెంట్స్
Supritha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సురేఖ వాణి (Surekha Vani)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో ఒక సినిమాలో పిన్ని, వదిన ,అక్క పాత్రలు కావాలి అంటే దర్శక నిర్మాతలు వెంటనే సురేఖ వాణిని సంప్రదించేవారు. ఇలా స్టార్ హీరోలు అందరి సినిమాలలో కీలక పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. సినిమాలకు దూరమైనప్పటికీ తన కుమార్తె సుప్రీతను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సుప్రీత అమరావతి, లేచింది మహిళలోకం అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీతకు అమ్మాయిల వస్త్రధారణ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల ఈమె ఒక కార్యక్రమంలో వేసుకున్న డ్రెస్ గురించి కూడా ఈ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. మొత్తం చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని కనిపించడంతో ఈ ఫోటోపై ఎన్నో కామెంట్లు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ డ్రెస్ వేసుకోవడానికి గల కారణాన్ని కూడా తెలియజేశారు అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ అమ్మాయిల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.
శివాజీ వ్యాఖ్యలపై సుప్రీత స్పందన
బయట వాళ్ళు సెలబ్రిటీల డ్రస్సులు గురించి మాట్లాడడంలో తప్పులేదు బహుశా వారికి అవగాహన ఉండదు కానీ ఇండస్ట్రీలో ఉన్న వారే అమ్మాయిల వస్త్రధారణ గురించి ఇటీవల ఒక వ్యక్తి మాట్లాడారు. దానిపై మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సుప్రీత సమాధానం చెబుతూ శివాజీ గారు అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడిన మాటలలో ఏమాత్రం తప్పులేదు. ఆయన మాట్లాడింది కరెక్ట్ కానీ ఆయన ఉపయోగించిన పదాలు మాత్రం తప్పని తెలిపారు. ఎప్పుడు డ్రస్సులు ఎలా వేసుకోవాలో ఆయన తెలియజేశారు. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూకి టీ షర్ట్, షార్ట్ వేసుకొని వస్తే బాగుండదు, అలాగే బీచ్ కి వెళ్లినప్పుడు ఈ డ్రెస్ వేసుకొని వెళ్తే అసలు బాగోదు.
సుప్రీత సురేఖ వాణి డ్రెస్సులపై విమర్శలు..
వస్త్రధారణపై అవగాహన ముఖ్యం
అమ్మాయిలకు వస్త్రధారణ విషయంలో అవగాహన ఉండి ఎప్పుడు ఎక్కడికి ఎలాంటి డ్రెస్ వేసుకొని వెళ్లాలో అలా వెళ్తే ఏ విధమైనటువంటి సమస్యలు రావని సుప్రీత ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పులేదని ఆయన చాలా కరెక్ట్ గా మాట్లాడారని అయితే మాట్లాడే సమయంలో ఉపయోగించిన పదాలు తప్పుగా ఉన్నాయని సుప్రీత తెలియజేశారు. అయితే ఒకానొక సమయంలో సుప్రీత తన తల్లి సురేఖవాణి వస్త్రధారణ పై కూడా ఎన్నో రకాల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదట్లో ఈ విమర్శలపై స్పందించిన ఈ తల్లి కూతుర్లు ఇటీవల కాలంలో ఇలాంటి వాటి గురించి అసలు స్పందించడం లేదనే చెప్పాలి. ఇక సుప్రీత ప్రస్తుతం చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
మొత్తానికి సుప్రీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వస్త్రధారణ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా, సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ ఉండాలనే వాదనకు ఆమె మద్దతు తెలిపారు.


