
📌 Key Points
- సుప్రీత ఫైర్: ట్రిప్స్ డబ్బులపై నెటిజన్ల కామెంట్స్‌కు ఘాటు రిప్లై!
- ఐటీ రిటర్న్స్ కడుతున్నా.. అయినా విమర్శలా? సుప్రీత ప్రశ్న!
- అమరావతికి ఆహ్వానం సినిమాతో హీరోయిన్‌గా సుప్రీత ఎంట్రీ!
- ట్రిప్స్ ఫోటోలు పెడితే నెగిటివ్ కామెంట్స్.. బాధతో సోషల్ మీడియాకు దూరం!
సురేఖవాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో తన ట్రిప్స్ ఫోటోలు, వీడియోలతో ఎప్పుడూ సందడి చేస్తూ ఉంటుంది. అయితే, ఈ ట్రిప్స్ విషయంలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై సుప్రీత ఎలా స్పందించిందో చూద్దాం.
ట్రిప్స్ పై నెటిజన్ల ట్రోల్స్.. సుప్రీత రియాక్షన్!
Supritha : నటి సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా, పలు షోలతో ఇప్పటికే ఫేమ్ తెచ్చుకుంది. సుప్రీత హీరోయిన్ గా అమరావతికి ఆహ్వానం అనే సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. సుప్రీత విదేశాలకు, గోవాకు ట్రిప్స్ వేస్తూ పలు ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ చేసేది.(Supritha)
దీంతో పలువురు నెటిజన్స్ వీళ్ళకు ట్రిప్స్ కి డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయి, వీళ్ళు ఇన్ని ట్రిప్స్ ఎలా వేస్తున్నారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సుప్రీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఫైర్ అయింది.
డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నలు.. సుప్రీత ఫైర్!
సుప్రీత మాట్లాడుతూ.. మా మీద నెగిటివిటి ఎందుకో తెలీదు. సెలబ్రిటీల మీద నెగిటివిటి చూపిస్తారు. మేము డబ్బులు సంపాదించుకొని మేము ట్రిప్స్ కి వెళ్తే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతారు. నేను ఐటి రిటర్న్స్ కూడా వేస్తాను. మేము వెళ్లి లక్షలు లక్షలు ఖర్చుపెట్టము. మేము సంపాదించే దాంట్లో కొంత ట్రావెలింగ్ లో ఖర్చుపెడతాము. సాఫ్ట్ వేర్ వాళ్ళు కూడా వెళ్తారు. చాలా మంది వెళ్తారు కానీ మా మీదే ఎందుకు ఎక్కువ ఫోకస్ ఎందుకు అని అర్ధం కాదు.
‘అమరావతికి ఆహ్వానం’తో హీరోయిన్‌గా సుప్రీత ఎంట్రీ!
నేను, మా అమ్మ వర్క్ చేస్తున్నాం. మా అమ్మ ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంది. కోట్లు ఆస్తులు లేకపోయినా బాగానే సంపాదించింది. జనాలకు వాళ్ళ ఊహలు ఏంటో తెలీదు. కానీ నేను వాళ్లకు ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఇలాంటి కామెంట్స్ అన్ని చూసే నేను ట్రావెలింగ్ చేసినా సోషల్ మీడియాలో పెట్టట్లేదు ఈ మధ్య. నేను ఆన్సర్ చెప్పాల్సింది మా అమ్మకు, నా అనుకున్న వాళ్లకు. వాళ్ళు వేలు ఎత్తి చూపించనంతవరకు బయటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దీని వల్ల నేను ఏడ్చాను కూడా ఎందుకు ఇలా అంటున్నారు అని. ఖాళీగా కూర్చొని కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. నేను పని చేసుకోవాలి కాబట్టి పట్టించుకోవడం మానేశా అని తెలిపింది.
సుప్రీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


