|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జై భీమ్ సంచలనం! రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల్లో దుమ్మురేపిన సూర్య సినిమా!!

Published: 30-01-2026, 1:35 AM
జై భీమ్ సంచలనం! రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల్లో దుమ్మురేపిన సూర్య సినిమా!!
  • సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల్లో 7 అవార్డులు.
  • ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా పలు విభాగాల్లో జై భీమ్ సత్తా చాటింది.
  • ఫిబ్రవరి 13న జరగనున్న వేడుకలో చిత్ర బృందం అవార్డులు అందుకోనుంది.
  • జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా జై భీమ్ సినిమా రూపొందించబడింది.

సూర్య నటించిన జై భీమ్ చిత్రం రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల్లో సత్తా చాటింది. ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు కూడా ఇందులో ఉన్నాయి.

రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల్లో జై భీమ్

Suriya JaiBhim:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఒకవైపు మాస్ పాత్రలతో అలరిస్తూ మరొకవైపు వైవిద్యమైన పాత్రల్లో కనిపిస్తూ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. అలా సూర్య నటించి, నిర్మించిన చిత్రాలలో జై భీమ్ కూడా ఒకటి. టీ.జే.జ్ఞానవేల్ దర్శకత్వంలో 2021 నవంబర్లో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఒక కోర్టు డ్రామా కథాంశంతో రూపొందించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైనప్పుడే ఎన్నో అవార్డులు అందుకుంది అలాంటి ఈ సినిమాకు ఇప్పుడు మరో అవార్డు లభించడం గమనార్హం.

తమిళనాడు ప్రభుత్వం తాజాగా 2016 నుండి 2022 వరకు పెండింగ్లో ఉన్న రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఇందులో సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా ఏకంగా ఏడు విభాగాలలో అవార్డులు గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు , ఉత్తమ సంగీత దర్శకుడు తో సహా పలు విభాగాలలో ఈ సినిమా సత్తా చాటింది. ఇక ఫిబ్రవరి 13వ తేదీన ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకలో చిత్ర బృందం ఈ అవార్డులను అందుకోబోతోంది. ఇక ఈ విషయం తెలిసి అటు చిత్ర బృందానికి, ఇటు హీరోకి అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

7 విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న జై భీమ్

ఇకపోతే ఈ సినిమా ఇప్పటివరకు అందుకున్న అవార్డ్స్ విషయానికి వస్తే.. 2022 నోయిడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాలలో అవార్డును గెలుచుకుంది. ఆస్కార్ అకాడమీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఈ సినిమాకు సంబంధించిన వీడియోని కూడా ఉంచారు. ఇక అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచడం అదే తొలిసారి కూడా.. అంతేకాదు తమిళ్ ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి విభాగంలో ఈ చిత్రానికి అవార్డ్స్ లభించాయి.ఇక జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2021 నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా వివక్షత, పోలీసు దుష్ప్రవర్తనను పరిష్కరిస్తూ.. గిరిజన మహిళ కోసం న్యాయవాది చంద్రు పోరాడిన జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఫిబ్రవరి 13న అవార్డుల ప్రదానోత్సవం

సూర్య, లిజోమాల్ జోష్, మణికందన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రోల్డెన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య , జ్యోతిక ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. గిరిజన హక్కులు, పోలీసు అణిచివేత , న్యాయ వ్యవస్థలోని లోపాలను ఈ చిత్రం బలంగా ప్రశ్నించింది . ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా విశేష ప్రజాధారణ పొందింది. ఈ సినిమాతో సూర్యకి కూడా ఊహించని విజయం లభించింది.

జై భీమ్ సినిమాకు ఇన్ని అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నం. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.