|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Suriya45 టైటిల్ & టీజర్‌పై బిగ్ అప్డేట్.. ఆనందంలో ఫ్యాన్స్

Published: 18-06-2025, 12:19 PM
Suriya45 టైటిల్ & టీజర్‌పై బిగ్ అప్డేట్.. ఆనందంలో ఫ్యాన్స్

Key Points

1

సూర్య 45 సినిమా టైటిల్ మరియు టీజర్ జూన్ 20న విడుదల కానున్నాయి.

2

త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

3

ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Suriya45 టైటిల్ & టీజర్ విడుదల తేదీ

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘సూర్య-45’ (Suriya45) ఒకటి. Suriya45 అనే వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ చేసిన ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. అనౌన్స్‌మెంట్ తప్ప ఈ సినిమా నుంచి ఏ అప్‌డేట్ రాకపోవడంతో సూర్య ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మీడియాతో ముచ్చటించిన నిర్మాత ఎస్ఆర్ ప్రభు సూర్య 45 టైటిల్ అప్డేట్ జూన్ మూడవ వారంలో విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్లు గానే.. తాజాగా సూర్య45 టైటిల్ & టీజర్‌పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టైటిల్ & టీజర్ జూన్ 20న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. కాగా.. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీనిని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

సినిమాపై పెరుగుతున్న అంచనాలు

జూన్ 20న విడుదల కానున్న సూర్య 45 సినిమా టైటిల్ మరియు టీజర్ అభిమానుల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. త్రిష, ఏ.ఆర్. రెహమాన్ లాంటి ప్రముఖులతో ఈ సినిమా విజయవంతం అవుతుందని అంచనా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.