
📌 Key Points
- స్విమ్స్ లో ఎన్నారై ఎంబీబీఎస్ విద్యార్థులకు 4½ సంవత్సరాలకే ఫీజుల వసూలు
- విద్యార్థుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్న టీటీడీ
- 2021-22 బ్యాచ్ విద్యార్థులకు సైతం వర్తించేలా చర్యలు
- స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో ఆమోదం తెలపనున్న అధికారులు
తిరుపతిలోని స్విమ్స్ కళాశాలలో ఎన్నారై ఎంబీబీఎస్ విద్యార్థులకు శుభవార్త. ఇకపై ఐదు సంవత్సరాలకు బదులుగా నాలుగున్నర సంవత్సరాలకే ట్యూషన్ ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు టీటీడీ ఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నారై విద్యార్థుల విజ్ఞప్తి
స్విమ్స్ – శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను ఐదు సంవత్సరాలకు కాకుండా 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇటీవల టీటీడీ ఈవోను కలిశారు. తమ కోర్సు వ్యవధి 4½ సంవత్సరాలు మాత్రమే కావడంతో అదే మేరకు ఫీజులు వసూలు చేయాలని టీటీడీ ఈవో ఎం.రవిచంద్రకు విజ్ఞప్తి చేశారు. స్విమ్స్ – శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను 5 సంవత్సరాలకు వసూలు చేస్తున్నట్లు వారు వినతి పత్రం సమర్పించారు.
ఈ అంశాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో, నేషనల్ మెడికల్ కమిషన్ 07-04-2026న జారీ చేసిన నిబంధనలను పరిశీలించి, ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ కోర్సుకు ఫీజులు 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో చర్చించి, తగిన ఆమోదం (రాటిఫికేషన్) పొందేందుకు చర్యలు తీసుకోనున్నారు.
టీటీడీ ఈవో నిర్ణయం
ప్రస్తుతం 2021-22బ్యాచ్ విద్యార్థులు చివరి సంవత్సరంలో ఉండటంతో వారికి 5 సంవత్సరాలకంటే 4½ సంవత్సరాలకే ఫీజులు వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇదే విధానం ఇకపై వచ్చే తదుపరి బ్యాచ్‌లకు కూడా అమలు కానుంది.
తిరుపతి స్విమ్స్‌లో చదివే ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈ నిర్ణయంతో ఊరట దక్కనుంది. ఇప్పచిదాకా ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు ఐదేళ్లకు ట్యూషన్ ఫీజులు చెల్లిస్తున్నారు. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్వి్మ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ దీనిపై చర్చించింది. చివరకు ట్యూషన్ ఫీజును 5 సంవత్సరాలకు కాకుండా నాలుగున్న ఏళ్లకే చెల్లించాలని నిర్ణయించింది.
కొత్త విధానం అమలు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(SVIMS) ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైద్య విశ్వవిద్యాలయం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో నడుస్తుంది. 24/7 అత్యవసర సేవలు, ఆధునిక పరికరాలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తుంది. ఇక్కడ క్యాన్సర్ చికిత్స, జనరల్ మెడిసిన్, ఇతర ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
స్విమ్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నారై విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ అధికారికంగా ప్రకటించనుంది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


