
📌 Key Points
- స్విమ్స్ తిరుపతిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- మార్చి 20 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
- చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.54000, సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.38000 జీతం లభిస్తుంది.
- ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో ఉద్యోగాలు ఉన్నాయి. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్విమ్స్ తిరుపతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తిరుపతి శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం నోటిఫికేషన్ వెలువడింది. వెంటనే అప్లై చేసుకోవాలి. తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 20వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి.
మెుత్తం మూడు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అందులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకటి. సెక్యూరిటీ ఆఫీసర్ రెండు.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ కలిగి ఉండాలి. మెరిటోరియస్ ఎక్స్-ఆర్మీ సిబ్బంది అయి ఉండాలి. A.P పోలీస్ డిపార్ట్‌మెంట్ సీఐ కేడర్‌కు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ అర్హత కావాలి. ఎత్తు – 170 సెం.మీ., ఛాతీ – 81 సెం.మీ. (గాలీ పీల్చినప్పుడు 85 సెం.మీ.). ఆరోగ్యకరంగా ఉండాలి. దృష్టి లోపం ఉండొద్దు. శారీరక, మానసికంగా బలంగా ఉండాలి.
ముఖ్యమైన తేదీలు, అర్హతలు
సెక్యూరిటీ ఆఫీసర్‌కు భారత సైన్యంలో (ఎ) సుబేదార్ / జెసిఓ హోదాలో లేదా రక్షణ దళాలలో అసాధారణమైన సేవ రికార్డుతో సమానమైన హోదాలో పనిచేసినవారు కావాలి. ఇక మిగిలిన అర్హతలు పైన చెప్పిన విధంగా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లకు మించకూడదు.
జీతం విషయానికి వస్తే.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు నెలకు రూ.54000 వరకు వస్తుంది. సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.38000 అందిస్తారు.
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మార్చి 20వ తేదీలోపు దరఖాస్తును పంపాల్సి ఉంటుంది. దానిపై ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో రాయాలి.
జీతం, ఎంపిక విధానం
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)
ఈ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.
అప్లికేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
స్విమ్స్ తిరుపతిలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.


