
📌 Key Points
- ప్రభాస్‌తో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ ఆఫర్‌ని వదులుకున్న తమన్నా.. కారణం డేట్స్ కుదరకపోవడమేనట!
- మిల్కీ బ్యూటీ కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్ ఇదేనంటూ స్వయంగా వెల్లడించిన తమన్నా భాటియా!
- 2011లో విడుదలైన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ మూవీలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు.
- దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఒకప్పటి స్టార్ హీరోయిన్ తమన్నా నటించే అవకాశం కోల్పోయిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకు ఆమె ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి.
మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన తమన్నా
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. గ్లోబల్ ఇమేజ్ కన్నేశారు. ఇప్పటికే ఆయన్ని ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ విషయంలో తాను తప్పు చేసినట్టు బాధపడుతుంది తమన్నా. మిల్కీ బ్యూటీగా పాపులర్ అయిన ఆమె ఇప్పుడు తెలుగులో సినిమాలు తగ్గించింది. బాలీవుడ్‌లోనే నటిస్తుంది. సినిమాల్లో కంటే ఐటెమ్ సాంగ్స్ తో ఎక్కువగా వైరల్‌గా మారుతుంది. ఆమె ప్రభాస్‌తో సినిమా మిస్ కావడంపై స్పందించింది. తన విచారం వ్యక్తం చేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో `శ్రీ` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఇందులో మంచు మనోజ్‌తో కలిసి నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత రెండేళ్లకి `హ్యాపీడేస్` మూవీ పడింది. ఈ మూవీ తమన్నా లైఫ్‌నే మార్చేసింది. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది. దీంతో తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. `కాళిదాసు`, `కొంచెం ఇష్టం కొంచెం కష్టం`, `100% లవ్`, `బద్రినాథ్`, `రచ్చ`, `ఊసరవెళ్లి`, `రెబల్`, `ఎందుకంటే ప్రేమంటా`, `కెమెరామెన్ గంగతో రాంబాబు`, `తఢఖా`, `ఆగడు`, `బాహుబలి`, `బెంగాల్ టైగర్`, `ఊపిరి`, `జాగ్వర్`, `అభినేత్రి`, `నా నువ్వే`, `నెక్ట్స్ ఏంటి?` `ఎఫ్2`, `ఎఫ్3`, `సైరా`, `సిటీమార్`, `మ్యాస్ట్రో`, `గుర్తుందా శీతాకాలం`, `భోళా శంకర్`, `ఓడెల 2` చిత్రాల్లో నటించింది. తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణించింది. మధ్యలో కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. పాటల్లో అందాల కోసమే తమన్నాని తీసుకున్న సినిమాలు చాలా ఉన్నాయని చెబితే అతిశయోక్తి కాదు.
తమన్నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్ ఇదేనా?
అయితే తమన్నా కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో ప్రభాస్‌ని రిజెక్ట్ చేసింది. ఆమెకి డార్లింగ్‌తో `మిస్టర్ పర్‌ఫెక్ట్` సినిమాలో నటించే ఆఫర్ వచ్చిందట. కానీ రిజెక్ట్ చేసింది. ఇందులో హీరోయిన్‌గా ఛాన్స్ ముందు తనకే వచ్చిందని, కానీ ఆ టైమ్ చేయడం కుదరలేదని, దీంతో ప్రభాస్‌కి నో చెప్పాల్సి వచ్చిందని పేర్కొంది. ఆ తర్వాత సినిమా విడుదలయ్యాక చూసి చాలా బాధపడిందట. ఇలాంటి సినిమానా తాను మిస్ చేసుకున్నదని అని బాధపడిందట. తనకు నచ్చిన మూవీస్‌లో అదొకటి అని తెలిపింది తమన్నా. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది.
ప్రభాస్‌తో కలిసి నటించలేకపోయినందుకు చింతిస్తున్న మిల్కీ బ్యూటీ
ప్రభాస్ హీరోగా రూపొందిన `మిస్టర్ పర్‌ఫెక్ట్` మూవీకి దశరథ్ దర్శకుడు. ఇందులో డార్లింగ్‌కి జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ 2011 ఏప్రిల్ 22న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో కాజల్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఆమెపాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. కాజల్ కూడా బాగా చేసింది. ఇందులో కాజల్ చేసిన పాత్రనే తమన్నా మిస్ చేసుకుందని చెప్పొచ్చు. ఈ మూవీ ఆ మధ్య రీ రిలీజ్ అయ్యింది. విశేష ఆదరణ పొందింది. ఇదిలా ఉంటే తమన్నా, ప్రభాస్ కలిసి `రెబల్`, `బాహుబలి` రెండు పార్ట్ ల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే.
తమన్నా మిస్ చేసుకున్న ఈ అవకాశం గురించి తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరిన్ని టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


