|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇవాళ ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ ‘వెంబు’.. సమాజాన్ని ఎదిరించి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే అమ్మాయి కథ.. 9.5 ఐఎండీబీ రేటింగ్

Published: 13-09-2025, 6:47 AM
ఇవాళ ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ ‘వెంబు’.. సమాజాన్ని ఎదిరించి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే అమ్మాయి కథ.. 9.5 ఐఎండీబీ రేటింగ్

9.5 IMDb రేటింగ్‌తో విజయవంతమైన తమిళ సినిమా ‘వెంబు’ ఇప్పుడు ఆహా తమిళ ఓటీటీలో అందుబాటులో ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, మార్షల్ ఆర్ట్స్‌పై అమితమైన ప్రేమతో ఉన్న అమ్మాయి కథను చూపుతుంది.

Key Points

1

తమిళ బ్లాక్ బస్టర్ ‘వెంబు’ ఓటీటీలో రిలీజ్.

2

9.5 IMDb రేటింగ్‌తో అద్భుతమైన ప్రేక్షకాదరణ.

4

షీలా రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో అద్భుతమైన నటన.

‘వెంబు’ ఓటీటీ ప్రయాణం

ఓటీటీలోకి మరో తమిళ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కోలీవుడ్ నుంచి వస్తూనే ఉంటాయి. అలాంటి అద్భుతమైన స్టోరీ లైన్ తో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన మూవీ ‘వెంబు’ (Vembu). ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజైంది. మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 13) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళ బ్లాక్ బస్టర్ సినిమా వెంబు ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ మూవీ శనివారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. వెంబు చిత్రం ఆహా తమిళ్ ఓటీటీలోకి వచ్చేసింది. ‘‘వెంబు, రియల్ రెబల్ ఇప్పుడు ఆహాలో. ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతున్న వెంబును చూసేయండి’’ అని ఆహా తమిళ్ ఎక్స్ లో పోస్టు చేసింది. ఇప్పటికైతే ఈ సినిమా కేవలం తమిళం భాషలోనే అందుబాటులో ఉంది.

మహిళా శక్తికి నిదర్శనం

థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత వెంబు సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ ఏడాది మే 23న ఈ చిత్రం థియేటర్లో విడుదలైంది. ఆడియన్స్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి కథ, డైరెక్షన్ జస్టిన్ ప్రభు. హరి క్రిష్ణ‌న్‌, షీలా రాజ్ కుమార్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీకి ఐఎండీబీలో 9.5 రేటింగ్ ఉండటం విశేషం.

వెంబు సినిమాలో షీలా రాజ్ కుమార్ ఫీమేల్ లీడ్ ప్లే చేసింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు వెంబు. ఇది ఓ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. మార్షల్ ఆర్ట్స్ పై అమితమైన ప్రేమ ఉన్న అమ్మాయి వెంబు స్టోరీ ఈ సినిమా. ఓ వైపు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే కల కోసం సాధన చేస్తూనే, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంటుంది వెంబు.

సమాజ వ్యతిరేకతను ఎదుర్కొన్న వెంబు

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే దిశగా వెంబుకు తండ్రి సపోర్ట్ గా నిలుస్తాడు. కానీ సమాజంలోని మనుషుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆ సమయంలోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. భర్త కూడా వెంబును మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ప్రోత్సహిస్తాడు. అప్పుడు ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో వెంబు అండగా నిలుస్తుంది. ఓ మహిళా అనుకుంటే ఏమైనా సాధించలదనే పట్టుదలతో కష్టపడుతుంది. మరి చివరకు వెంబు అనుకున్నది సాధించిందా? ఆమెను ప్రశ్నించిన నోర్లు మూసుకున్నాయా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

వెంబు సినిమా సమాజంలోని అనేక అంశాలను ప్రస్తావిస్తూ, మహిళా శక్తిని చక్కగా చూపిస్తుంది. ఈ సినిమా మీరు తప్పకుండా చూడాల్సిన చిత్రం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.