|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

TCS ఉద్యోగులకు భారీ షాక్! అప్రైజల్ తర్వాత జీతాల్లో వేల రూపాయల కోత?

Published: 19-05-2026, 4:31 PM
TCS ఉద్యోగులకు భారీ షాక్! అప్రైజల్ తర్వాత జీతాల్లో వేల రూపాయల కోత?
  • TCS ఉద్యోగులకు అప్రైజల్ తర్వాత రూ.3 వేల వరకు జీతాల కోత.
  • 5% వేతన పెంపు ఆశించిన ఉద్యోగులకు నిరాశ ఎదురైంది.
  • కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం శాలరీ స్ట్రక్చర్‌లో మార్పులు ప్రధాన కారణం.
  • గ్రాట్యుటీ తొలగింపు, వేరియబుల్ పే మార్పులే కోతకు దారితీశాయి.

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ తన ఉద్యోగులకు అప్రైజల్ వేళ ఊహించని షాకిచ్చింది. కొత్త లేబర్ కోడ్‌ల అమలు నేపథ్యంలో వేతన నిర్మాణంలో మార్పులు చేయడంతో, ఉద్యోగుల జీతాల్లో రూ.3 వేల వరకు కోత పడింది. ఇది కార్మిక చట్టాల ప్రభావంపై చర్చకు దారితీస్తోంది.

అప్రైజల్ వేళ TCS ఉద్యోగులకు షాక్

దేశంలో ప్రఖ్యాత ఐటీ కంపెనీ కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)‌లో ప్రస్తుతం అప్రైజల్ సీజన్ నడుస్తోంది. కంపెనీ ఈ ఏడాది సగటున 5 శాతం మేర వేతన పెంపును (Salary Hike) ఉంటుందని చెప్పడంతో ఉద్యోగులంతా సంబురపడ్డారు. అయితే, చవరి నిమిషంలో కంపెనీ అందరికీ ఊహించని షాకిచ్చింది. తీరా చేతికి వచ్చిన జీతం స్లిప్పులు, రివైజ్డ్ సీటీసీ (CTC) లెటర్లను చూసి అంతా గందరగోళంతో తలలు బాదుకున్నారు. జీతం పెరగాల్సింది పెంచాల్సింది పోయి నెలకు రూ.3 వేల వరకు శాలరీ తగ్గిందంటూ పలువురు ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీ మే 18న అధికారికంగా జీతాల పెంపును ప్రకటించింది. ఈసారి కంపెనీ తన శాలరీ స్ట్రక్చర్‌ను పూర్తిగా రివైజ్ చేశారు. ముఖ్యంగా భార‌త్‌లో రాబోయే కొత్త లేబర్ కోడ్స్ (New Labour Codes) నిబంధనలకు అనుగుణంగా టీసీఎస్ భారీ మార్పులు చేసింది. దీంతో ఆ మార్పుల వల్ల ఆఫర్ లెటర్‌లో కనిపించే వార్షిక సీటీసీలో రూ.1,000 నుంచి రూ.10,000 వరకు తగ్గింపు కనిపిస్తోంది. మరికొందరికి చేతికొచ్చే శాలరీలో నెలకు రూ.3,000 వరకు కోత పడినట్లు ఉద్యోగులు తెలిపారు. అందుకు ప్రధాన కారణం సీటీసీ డిస్‌ప్లే స్ట్రక్చర్ నుంచి గ్రాట్యుటీని తొలగించడం, అలాగే వేరియబుల్ పే (Variable Pay), అలవెన్సుల కేటాయింపుల్లో మార్పులు చేయడమేనని తెలుస్తోంది. తక్కువ పర్ఫార్మెన్స్ బ్యాండ్‌లు పొందిన ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. మరోవైపు ఈ మొత్తం పరిణామాలపై టీసీఎస్ స్పందించింది. కంపెనీ ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీని రక్షించడానికి, పన్ను ఆదా (Tax Efficiency) సౌలభ్యం కోసమే కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం శాలరీ స్ట్రక్చర్‌ను మార్చినట్లుగా క్లారిటీ ఇచ్చింది.

జీతాల కోతకు కారణాలు ఏమిటి?

కొత్త లేబర్ కోడ్‌ల ప్రభావం

కొత్త లేబర్ కోడ్‌ల పేరుతో టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వేతన పెంపు ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఇతర కంపెనీల విధానాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.