|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

TGFA 2025: గద్దర్ పేరుతో సినీ సంబరాలు! హైదరాబాద్‌లో అట్టహాసంగా అవార్డుల వేడుక!

Published: 18-03-2026, 3:05 PM
TGFA 2025: గద్దర్ పేరుతో సినీ సంబరాలు! హైదరాబాద్‌లో అట్టహాసంగా అవార్డుల వేడుక!
  • తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA 2025) మార్చి 19, 2026న జరగనుంది.
  • ఈ వేడుకలో భారతీయ సినీ ప్రముఖులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.
  • నిధి అగర్వాల్ మరియు అంతర్జాతీయ డాన్స్ ఐకాన్స్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
  • సినిమా, థియేటర్, టెలివిజన్ రంగాల్లోని ప్రతిభను ఈ అవార్డులు గుర్తిస్తాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA 2025) వేడుకకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. మార్చి 19, 2026న HITEXలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.

TGFA 2025: వేడుక ఎప్పుడు, ఎక్కడ?

TGFA 2025: ఎన్నో ఎళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నంది అవార్డ్ పేరు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు (Telangana Gaddar Film Awards)గా పేరు మార్చి.. ఎప్పుడు ఆగిపోయాయో, అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వరసగా అవార్డులను ప్రజంట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA 2025) రెండో ఎడిషన్ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) నగరం కళాత్మక మహోత్సవానికి గ్రాండ్‌గా సిద్ధమైంది. ఈ అవార్డ్స్ వేడుక 19 మార్చి, 2026న HITEX కన్వెన్షన్ సెంటర్‌లో నూతన తెలుగు సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా జరిపేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ వేడుకలో భారతీయ సినీ రంగంలోని దిగ్గజాలు, రాష్ట్ర నాయకులు కలిసి తెలుగు ప్రతిభను సత్కరించనున్నారు.

అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణలు

సినిమా, సంస్కృతి, ప్రజల స్వరానికి అంకితమైన ఈ TGFA అవార్డులు రాష్ట్రంలో అత్యున్నత సినీ గౌరవంగా నిలుస్తాయి. సినిమా, థియేటర్, టెలివిజన్ రంగాల్లో విశిష్ట ప్రతిభను గుర్తించి, ప్రాంతీయ కథనాలను ప్రోత్సహించడం, పరిశ్రమకు వెన్నెముకలైన టెక్నీషియన్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ వేడుక జరగబోతుంది. మాస్టర్స్ ఆఫ్ సెరిమనీస్‌తో మొదలై.. ఎన్నో వినోదభరితమైన కార్యక్రమాలతో ఈ వేడుకను నిర్వహించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ముందుగా ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ఆఫ్ సెరిమనీస్ అనంతరం నిఖిల్ విజయేంద్ర, డౌలత్ సుల్తానా కలిసి అతిథులను ఆహ్వానించనున్నారు. అనంతరం స్మాల్ స్క్రీన్ క్వీన్ సుమ కనకాల, యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నడిపించనున్నారు.

TGFA అవార్డుల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

TGFA 2025 వేదికపై సినీ గ్లామర్, సాంస్కృతిక వారసత్వం కలగలిపిన అద్భుత ప్రదర్శనలతో ఎంటర్‌టైనింగా ఈ వేడుక సాగనుంది. ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ డాన్స్ ఐకాన్స్, AGT విజేతలు తమ అద్భుత నృత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఉదయ్ డాన్స్ గ్రూప్ వనజ తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శన ఇస్తారు. శ్రేయా ఘోషల్, దేవి శ్రీ ప్రసాద్, మంగ్లీ లైవ్ ప్రదర్శనలతో సందడి చేయనున్నారు. జాతీయ, ప్రాంతీయ సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు వంటి వారెందరో ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇంకా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఉలగనాయగన్ కమల్ హాసన్, కింగ్ నాగార్జున, అక్కినేని అఖిల్, నాగ చైతన్య, రష్మిక మందన్న, ఖుష్బూ సుందర్, సజా అలీ, మాధురి దీక్షిత్, ఇషా గుప్తా, శోభిత ధూళిపాళ, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా వంటి ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారని తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ టీమ్ అధికారికంగా తెలియజేసింది.

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA 2025) వేడుక సినిమా, సంస్కృతికి అద్దం పట్టేలా ఘనంగా జరగనుంది. సినీ ప్రముఖులు, కళాకారుల ప్రదర్శనలతో ఈ కార్యక్రమం మరింత శోభాయమానంగా ఉండనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.