
📌 Key Points
- 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు.
- టెక్స్‌టైల్ రంగ అభివృద్ధికి సహకరించాలని పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపునిచ్చారు.
- రాష్ట్ర ప్రభుత్వం, CITI కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సును నిర్వహించాయి.
- సదస్సులో టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను మంత్రులతో కలిసి సీఎం సందర్శించారు.
తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
దక్షిణాసియాలో తెలంగాణ టెక్స్‌టైల్ హబ్‌గా ఎదుగుదల
వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో తమతో భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON2026) ను నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెక్స్‌కాన్-2026 నివేదికను విడుదల చేశారు. ఈ సదస్సులో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అధికారులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి… మంత్రులతో కలిసి సందర్శించారు.
ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం
ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. “అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్ రంగాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాయి. నిజాం కాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్ నగరానికి వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలదు. టెక్స్‌టైల్స్ మా డీఎన్ఏలో ఉంది” అని గుర్తు చేశారు.
ఏషియా టెక్స్‌టైల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
తెలంగాణను టెక్స్‌టైల్ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిద్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రకటనతో పరిశ్రమ వర్గాల్లో నూతనోత్సాహం నెలకొంది.


