|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐస్‌క్రీమ్‌లపై కొరడా ఝళిపించిన గ్రామాలు! పిల్లల ఆరోగ్యం కోసం సంచలన నిర్ణయం!

Published: 06-04-2026, 11:06 AM
ఐస్‌క్రీమ్‌లపై కొరడా ఝళిపించిన గ్రామాలు! పిల్లల ఆరోగ్యం కోసం సంచలన నిర్ణయం!
  • నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఐస్‌క్రీమ్ బండ్లపై నిషేధం విధింపు.
  • పిల్లల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తుల వెల్లడి.
  • నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.5,000 జరిమానా విధింపు.
  • క్యాన్సర్ కారకాలతో ఐస్‌క్రీమ్‌లు తయారవుతున్నాయని గ్రామస్తుల ఆందోళన.

నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీలు ఐస్‌క్రీమ్ బండ్లను నిషేధించాయి. పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5,000 జరిమానా విధిస్తారు.

గ్రామాల్లో ఐస్‌క్రీమ్ బండ్ల నిషేధం ఎందుకు?

నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. వేసవిలో ఐస్‌క్రీమ్ బండ్లు చాలా వరకు ఊర్లలోకి వస్తున్నాయి. దీనిద్వారా పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. ఇది గమనించిన పలు గ్రామాల ప్రజలు ఐస్‌క్రీమ్ విక్రయాలను నిషేధించాయి.

ఐస్‌క్రీమ్ బండ్లు గ్రామాల్లోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ నిజామాబాద్ జిల్లాలోని పలు పంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలను ఆమోదించాయి. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించే విక్రేతలకు రూ.5,000 జరిమానా విధిస్తామని గ్రామాల్లో హెచ్చరిస్తూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. నిజానికి మెుదట కొన్ని గ్రామాల్లో ఈ ఉద్యమం మెుదలైంది. తర్వాత తర్వాత పలు మండలాలకు వ్యాపించింది.

డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి, మక్లూర్ మండలంలోని మందాపూర్, అలాగే డొంకేష్వర్ మండలంలోని గాదేపల్లి, అన్నారం, నుత్పల్లి, తొండకూర్ వంటి గ్రామాలు కూడా ఇటువంటి తీర్మానాలనే ఆమోదించాయి. నందిపేట, ఆర్మూర్, ముపకల్, వేల్పూర్ మండలాల్లోని పంచాయతీలు కూడా రహదారుల పక్కన ఐస్‌క్రీమ్ విక్రయాలను ఏకగ్రీవంగా నిషేధించాయి.

ఉల్లంఘిస్తే భారీ జరిమానా!

ఈ నిషేధాన్ని తెలియజేసే బోర్డులను గ్రామాల ప్రవేశ ద్వారాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. పిల్లల ఆరోగ్యం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోపుడు బండ్ల నుండి ఐస్‌క్రీమ్ తింటున్న పిల్లలు తలనొప్పి, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అలాగే ఐస్‌క్రీమ్‌లలో కృత్రిమ రంగులు, రసాయనాలను వినియోగించడంపై ఆందోళన చెందుతున్నారు. ఇవి క్యాన్సర్‌ తో సహా తీవ్రమైన అనారోగ్యాలకు దారితీయవచ్చని వారు పేర్కొన్నారు.

ఐస్ క్రీమ్ బండ్లను నిషేధించే తీర్మానాలను ఆమోదించడానికి ముందు గ్రామ సభలను నిర్వహించారు. ఈ ప్రక్రియలో గ్రామ అభివృద్ధి కమిటీలు, రియు యువజన సంఘాలు తమ మద్దతును అందించాయి.

గ్రామస్తుల మద్దతుతో ఏప్రిల్ 2వ తేదీ నుండి గ్రామంలో ఐస్‌క్రీమ్ తోపుడు బండ్లను తాము నిషేధించామని సుదపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం తెలిపింది. ఎవరైనా ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే, వారికి రూ.5,000 జరిమానా విధిస్తామని వెల్లడించింది.

గ్రామస్తుల ఆందోళన, ఆరోగ్య సమస్యలే కారణమా?

ఈ ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను తిన్న తర్వాత పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. ఆరోగ్యపరమైన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ఇటువంటి విక్రయాలను నిలిపివేయాలని పలు గ్రామాలు నిర్ణయిస్తున్నాయి.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

చిన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా, నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు ఐస్‌క్రీం బండ్లను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇది మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.