|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణలో 308 కోట్లకు పైగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం.. రూ. 10,696 కోట్లు ఆదా!

Published: 08-06-2026, 5:00 PM
తెలంగాణలో 308 కోట్లకు పైగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం.. రూ. 10,696 కోట్లు ఆదా!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు ఈ పథకం ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. సోమవారం (జూన్ 8) ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఏకంగా 308 కోట్లకు పైగా మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు.

ఈ ఉచిత ప్రయాణాల ద్వారా తెలంగాణలోని సామాన్య, మధ్యతరగతి మహిళలకు రవాణా ఖర్చుల రూపంలో దాదాపు రూ. 10,696 కోట్ల ఆర్థిక ఊరట లభించింది. మెుత్తం మహిళల ప్రయాణాలు లెక్క వేయగా.. 308 కోట్లకుపైగా ఉన్నాయి. మహిళలు తమ దైనందిన ప్రయాణాల కోసం ఖర్చు చేసే ఈ భారీ మొత్తాన్ని పొదుపు చేసుకోగలిగారు.

ఇప్పటికే కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, త్వరలోనే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు మరియు పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.

ఇప్పటివరకు మహిళలు తమ ఆధార్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్ పొందుతున్నారు. అయితే దీని స్థానంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆర్ఎఫ్ఐడి సాంకేతికతతో కూడిన స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు.

రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ కార్డుల ముద్రణ పూర్తి చేసి, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన మహిళలందరికీ ఈ మహాలక్ష్మి కార్డులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. బస్సు ఎక్కినప్పుడు కండక్టర్‌కు ఆధార్ కార్డ్ చూపించి, అడ్రస్ వెరిఫై చేసుకుని జీరో టికెట్ తీసుకునే సమయం ఆదా అవుతుంది.

బస్సుల్లో ఉండే సరికొత్త ఈబీఎం మిషన్లపై ఈ స్మార్ట్ కార్డును సింపుల్‌గా ట్యాప్ చేయడం ద్వారా ప్రయాణ వివరాలు నమోదవుతాయి. ఏ రూట్‌లో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారనే కచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. దీని ఆధారంగా రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు బస్సులను సర్దుబాటు చేయడం సులువవుతుంది.

ఈ స్మార్ట్ కార్డును పొందడానికి మహిళలు కొన్ని వివరాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అయి ఉండాలి. ఆధార్ కార్డ్ నకలు (ఆధార్‌లో తెలంగాణ అడ్రస్ ఉండాలి). ప్రజా పాలన దరఖాస్తు రశీదు లేదా రేషన్ కార్డ్ (ఆప్షనల్). పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.

మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలకు భారీగా రవాణా ఖర్చులు పొదుపు అవుతున్నాయి. ఇప్పుడు రాబోయే స్మార్ట్ కార్డుల ద్వారా ఈ డిజిటల్ ప్రయాణం మహిళలకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.