
‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ సినిమా ‘తెలుసు కదా’ ట్రైలర్ విడుదలైంది. ఇద్దరమ్మాయిలతో ప్రేమలో ఉన్న సిద్ధు కథ ఆసక్తిగా ఉంది. కోన నీరజ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న విడుదల కానుంది.
Key Points
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 'తెలుసు కదా' సినిమా ఈ శుక్రవారం (అక్టోబరు 17) విడుదల కానుంది.
ఈ చిత్రంలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించగా, కోన నీరజ దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.
ట్రైలర్‌లో కథాంశం పూర్తిగా రివీల్ చేయకుండా, ఎమోషనల్ లవ్ స్టోరీని ఆసక్తికరంగా చూపించారు.
ఇదే వీకెండ్‌లో 'మిత్రమండలి', 'డ్యూడ్', 'కె ర్యాంప్' వంటి మరో మూడు సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి.
సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం ‘తెలుసు కదా’
‘డీజే టిల్లు’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘తెలుసు కదా’. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు కాగా.. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం(అక్టోబరు 17) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్‌లో అయితే స్టోరీ ఏంటనేది అస్సలు రివీల్ చేయలేదు. ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్‌లోనే ఉండాలి. ప్రేమించిన వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు అనుకునే మనస్తత్వం. అలాంటిది ఇద్దరమ్మాయిలతో రిలేషన్‌లోకి వెళ్తాడు. వాళ్లిద్దరూ కలిసి అంటే ముగ్గురు జర్నీ చేస్తారు? ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగింది? అనేదే తెలియాలంటే మూవీ చూడాలి. చూస్తుంటే రెగ్యులర్ లవ్ స్టోరీలా అయితే అనిపించట్లేదు. మరి సిద్ధు ఈసారి ఏం చేస్తాడో చూడాలి?
ట్రైలర్‌లో దాచిన కథాంశం
ఈ సినిమాతో పాటు ఇదే వీకెండ్‌లో మరో మూడు మూవీస్ కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. అవే ‘మిత్రమండలి’, ‘డ్యూడ్’, ‘కె ర్యాంప్’. ఈ చిత్రాల ట్రైలర్స్ ఇప్పటికే రిలీజ్ కాగా, ఇవి కూడా బాగానే అనిపించాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుంది? ప్రేక్షకుల మనసు ఏది గెలుచుకుంటుందనేది చూడాలి? గత నెలలో టాలీవుడ్‌కి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు రాబోయే సినిమాల బట్టి ఈనెల కూడా కలిసొస్తుందా లేదా అనేది తేలుతుంది.
ఈ వారం విడుదలయ్యే ఇతర సినిమాలు
‘తెలుసు కదా’ ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో, సినిమాపై అంచనాలు పెరిగాయి. సిద్ధు విభిన్నమైన ప్రేమకథ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ వారం విడుదలయ్యే ఇతర సినిమాలతో పోటీలో నిలిచి ఇది విజయం సాధిస్తుందేమో చూడాలి.


