
📌 Key Points
- దోస్త్ ఫేజ్ 2 రిజిస్ట్రేషన్లకు మే 25 చివరి తేదీ.
- కొత్త అభ్యర్థులు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
- ప్రత్యేక కేటగిరీల సర్టిఫికెట్ల పరిశీలన మే 26న.
- సీట్లు పొందినవారు మే 31 – జూన్ 5 మధ్య ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్ల గడువు దగ్గరపడుతోంది. ప్రభుత్వ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే ఈ ప్రక్రియలో, అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలకమైన అప్డేట్.
దోస్త్ ఫేజ్ 2: గడువు వివరాలు, ముఖ్య తేదీలు
TG DOST Phase 2 Registrations : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొదటి విడతలో సీటు రాని విద్యార్థులు… అలాగే ఇప్పటివరకు అసలు దరఖాస్తు చేసుకోని కొత్త అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అర్హులైన విద్యార్థులు రేపటిలోపు (మే 25) ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
సమయం తక్కువగా ఉన్నందున అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా కాలేజీల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లు కూడా ఎంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
దోస్త్ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే కొత్త అభ్యర్థులు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు కాలేజీలను ఎంచుకునేందుకు (వెబ్ ఆప్షన్లు) మే 26 వరకు అవకాశం కల్పించారు.
PH (దివ్యాంగులు), CAP (ఆర్మీ ఉద్యోగుల పిల్లలు), NCC, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వంటి ప్రత్యేక కేటగిరీల కింద సీట్లు ఆశించే అభ్యర్థులకు మే 26న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో (UHLCS) ఈ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ కేటగిరీల విద్యార్థులు తమ ఒరిజినల్ పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది.
1. TS DOST అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించండి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ: స్టెప్ బై స్టెప్ గైడ్
2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.
4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూరించండి.
5. దరఖాస్తు రుసుము చెల్లించండి.
సీట్ల కేటాయింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ విధానం
6. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
7. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోండి
దోస్త్ రెండో విడతలో రిజిస్ట్రేషన్ చేసుకుని, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు మే 30న సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు మే 31 నుంచి జూన్ 5 లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయని పక్షంలో వారికి దక్కిన సీటు రద్దవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గడువు లోపల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
దోస్త్ ఫేజ్ 2 రిజిస్ట్రేషన్లకు గడువు సమీపిస్తున్నందున, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో దరఖాస్తు చేసుకుని, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటేనే డిగ్రీ సీటు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది.


