
📌 Key Points
- టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
- మే 2 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.
- మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు; మే 9-11 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఎడిట్ చేసుకోవచ్చు: https://eapcet.tgche.ac.in/.
తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు టీజీ ఈఏపీసెట్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఎడిట్ ఆప్షన్ వివరాలు
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీతో గడువు ముసిగింది. ప్రస్తుతం ఆలస్య రుసుంతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. లేట్ ఫీజుతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే వెంటనే సవరించుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ చేసుకోవాలని సూచించారు. కేవలం ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
ముఖ్యమైన తేదీలు
ఇంజినీరింగ్ స్ట్రీమ్ అప్లికేషన్ కోసం సాధారణ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇక అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ కు కలిపి దరఖాస్తు చేసుకుంటే…. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000, ఇతరులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు మాత్రమే ఈ ఫీజులున్నాయి.ఈ తేదీ పూర్తి కావటంతో…. ఈ ఫీజుతో పాటు ఆలస్య రుసుంను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ https://eapcet.tgche.ac.in/ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.
టీజీ ఈఏపీసెట్ -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే…. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
ఫీజు వివరాలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పరీక్షల తేదీలను గుర్తుంచుకుని సన్నద్ధం కండి.


