
📌 Key Points
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.
- ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేస్తారు.
- ఫస్ట్ ఇయర్, సెకండియర్, ఒకేషనల్ కోర్సుల ఫలితాలు ఒకేసారి విడుదలవుతాయి.
- ఫలితాలు tgbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రేపు విడుదల కానున్న ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈనెల 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండియర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలను ఒకేసారి విడుదలవుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచుతామని బోర్డు తెలిపింది. ఇందుకోసం tgbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్ సైట్లను సంప్రదించాలని సూచించింది.
ఫలితాలు ఎక్కడ చూడాలి?
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ మాత్రమే కాకుండా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లోనూ సులభంగా తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి క్షణాల వ్యవధిలోనే డిస్ ప్లే అవుతాయి.
విడుదల చేయనున్న విద్యాశాఖ అధికారులు
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ ఫలితాలు హిందుస్తాన్ టైమ్స్( https://www.hindustantimes.com/ ) వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించి ఫలితాలు తెలుసుకోవచ్చు.


