
📌 Key Points
- తెలంగాణ రైతులకు రెండో విడత రైతు భరోసా నిధులు ఈ నెల 20న విడుదల కానున్నాయి.
- భూపాలపల్లి జిల్లా కాటారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిధుల పంపిణీ ప్రారంభం కానుంది.
- రెండో విడతలో 45 లక్షల మంది రైతులకు రూ.5653 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం.
- ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరానికి రూ.12,000 పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధం.
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులు ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.
రెండో విడత రైతు భరోసా విడుదల ఎప్పుడు?
రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈనెల 20వ తేదీన (ఎల్లుండి) రెండో విడుత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో రెండో విడత నిధులు విడుదల చేస్తారు.
ఎంత మంది రైతులకు లబ్ధి చేకూరనుంది?
తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడుత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా విడుదల చేసింది. దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రెండో విడతలో 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకుంటారు. దీంతో రూ.5653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం…. మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
రైతు భరోసా పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది. ప్రతి ఏడాది కూడా నిర్దేశించిన తేదీల్లో కొత్త రైతుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేసి… అర్హులైన రైతులకు పంట పెట్టుబడిసాయం అందిస్తారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కట్టుబడి ఉంది. రైతు భరోసా నిధుల విడుదల ద్వారా రైతుల ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరుతాయని ఆశిస్తున్నారు. త్వరలోనే మూడో విడత నిధులు విడుదల కానున్నాయి.


