|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్ సీక్రెట్ రిలేషన్ లీక్! త్వరలో పెళ్లి?

Published: 27-01-2026, 6:35 AM
షాకింగ్: ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్ సీక్రెట్ రిలేషన్ లీక్! త్వరలో పెళ్లి?
  • దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా రిలేషన్ లో ఉన్నట్లు ధృవీకరణ.
  • త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తరుణ్ భాస్కర్ వెల్లడి.
  • ఈషా రెబ్బా తనకు స్నేహితురాలి కంటే ఎక్కువ అని తెలిపిన తరుణ్.
  • గతంలో లతా నాయుడును వివాహం చేసుకున్న తరుణ్ భాస్కర్.

ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోయిన్ ఈషా రెబ్బాతో రిలేషన్ లో ఉన్నట్లు కన్ఫామ్ చేశారు. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈషా రెబ్బాతో రిలేషన్ పై తరుణ్ భాస్కర్ క్లారిటీ

Tharun Bhascker: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా నటుడిగా కొనసాగుతున్న తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా(Eesha Rebba) హీరో హీరోయిన్లుగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి (Om Shanthi Shanthi Shanthi) అనే సినిమా జనవరి 31 తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తరుణ్ భాస్కర్ కు ఈషా రెబ్బతో రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

గత రెండు సంవత్సరాలుగా తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలను వీరిద్దరూ ఎక్కడా ఖండించలేదు అలాగే వీరి రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. దీంతో వీరి రిలేషన్ గురించి నిత్యం ఏదో ఒక వార్త తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇద్దరి రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈషా తనుకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని తెలిపారు. ఇక త్వరలోనే నేను కూడా ఈ విషయం గురించి అందరితో అన్ని విషయాలు చెబుతాను అయితే సరైన సమయం కోసమే ఎదురు చూస్తున్నానని తెలిపారు.

త్వరలోనే శుభవార్త తెలిపనున్న డైరెక్టర్

ఈషా విషయంలో చెప్పడానికి దాచడానికి ఏమీ లేదు. ఇది మా వ్యక్తిగత విషయం కాబట్టి సరైన సమయంలో మాత్రమే ప్రకటిస్తామని అయితే నేను చెప్పే ఈ విషయం వేరే వారిని ఎఫెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి నేను చెప్పే మాటల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి. అందుకే కాస్త సమయం తీసుకుని ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తాము అంటూ తరుణ్ భాస్కర్ ఈషా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ మాటలు వింటుంటే ఏ క్షణమైనా ఈ జంట నుంచి గుడ్ న్యూస్ రావచ్చని స్పష్టమవతుంది.

ఇక తరుణ్ భాస్కర్ ఇదివరకు లతా నాయుడు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా లతా నాయుడు పనిచేశారు. వీరి వివాహం 2014వ సంవత్సరంలో జరిగిందని తెలుస్తుంది. అయితే 2022లో వీరిద్దరు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారంటూ వార్తలు వచ్చాయి కానీ అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇలా తన మొదటి భార్య నుంచి విడిపోయిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోయిన్ ఈషా రెబ్బాతో రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే ఈ రిలేషన్ గురించి అధికారికంగా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

గతంలో లతా నాయుడుతో వివాహం

మొత్తానికి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ గురించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడనుంది. దీనిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.