|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tharun Bhaskar: SPB విగ్రహ ప్రతిష్ట వివాదంపై తరుణ్ భాస్కర్ రియాక్షన్.. దెబ్బకు విజిల్స్ పడ్డాయి

Published: 08-12-2025, 9:08 AM
Tharun Bhaskar: SPB విగ్రహ ప్రతిష్ట వివాదంపై తరుణ్ భాస్కర్ రియాక్షన్.. దెబ్బకు విజిల్స్ పడ్డాయి
  • రవీంద్రభారతిలో ఎస్పీబీ విగ్రహ ప్రతిష్టపై వివాదం చెలరేగింది.
  • కొందరు తెలంగాణవాదులు ఎస్పీబీ విగ్రహ ప్రతిష్టను వ్యతిరేకించారు.
  • తరుణ్ భాస్కర్ ప్రాంతాలకు అతీతంగా కళను గౌరవించాలని పేర్కొన్నారు.
  • “రాజమండ్రి నాదే, వరంగల్ నాదే” అంటూ అతని సమాధానానికి విజిల్స్ పడ్డాయి.

రవీంద్రభారతిలో ఎస్పీబీ విగ్రహ ప్రతిష్టపై వివాదం రేగింది. దీనిపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందిస్తూ, కళకు ప్రాంతం లేదని, టాలెంట్‌ను గౌరవించాలని అన్నారు. ప్రాంతీయ వాదాన్ని ఖండిస్తూ ఆయన ఇచ్చిన సమాధానానికి సభికుల నుండి పెద్ద ఎత్తున విజిల్స్ పడ్డాయి. ఇది ఎంతగానో ఆకట్టుకుంది.

SPB విగ్రహ ప్రతిష్ట వివాదం: నేపథ్యం

Tharun Bhaskar: చాలామంది ప్రాంతంతో సంబంధం లేకుండా టాలెంట్ ని ఇష్టపడుతూ ఉంటారు. అసలు కళ కు మతం ప్రాంతం వంటివి అంటించకూడదు. ఎందుకంటే కులమత ప్రాంతాలకు అతీతం కళ. ఇప్పటికీ చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు హాలీవుడ్ సినిమాలను ఆదరిస్తారు. అలానే హాలీవుడ్ దర్శకులను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కేవలం ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళని ఆరాధిస్తారు అనడంలో కూడా అతిశయోక్తి లేదు.

అయితే గత కొంతకాలంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్రభారతిలో ప్రతిష్టిస్తున్న తరుణంలో కొంతమంది తెలంగాణవాదులు దానిని వ్యతిరేకించారు. ఒకప్పుడు ఒక పాటలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక లైన్ తనకు అభ్యంతరకరంగా ఉంది కాబట్టి నేను దీనిని పాడను అని ఎస్పీబీ చెప్పారట. స్వరాజ్యమై తెలంగాణ అని ఏదో లైన్ ఉండటం వలన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆ పాటను పాడను అని చెప్పారట. ఇప్పుడు దానిని తీసుకొని విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని మాట్లాడుతున్నారు కొంతమంది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్టించడం పైన తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యారు. కేవలం మనం ప్రాంతాల పరంగానే విడిపోయాం కానీ ఇంకో ఉద్దేశం లేదు అంటూ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో చాలామందిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అంటూ తరుణ్ భాస్కర్ మాట్లాడారు. అలా మాటల్లో భాగంగానే రాజమండ్రి నాదే వరంగల్ నాదే అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ ఆన్సర్ వినగానే అక్కడ ఉన్న చాలామంది ప్రెస్ రిపోర్టర్లు అందరు కూడా విజిల్స్ వేసి ప్రోత్సహించారు.

తరుణ్ భాస్కర్ రియాక్షన్: ప్రాంతీయవాదంపై స్పందన

ఇకపోతే తరుణ్ భాస్కర్ గతంలో కీడాకోలా సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటను వాడినందుకు అతనికి నోటీసులు కూడా వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. అయితే దానిని ఎస్పీ చరణ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అప్పట్లో తెలిపారు. మొత్తానికి ఆ ఇష్యూ కూడా షాట్ అవుట్ అయిపోయింది. అయితే దానిని పెద్దగా దృష్టిలో పెట్టుకోకుండా తరుణ్ భాస్కర్ ఇచ్చిన ఆన్సర్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఏదేమైనా కొంత టాలెంట్ ను ఒప్పుకోవాల్సింది దాన్ని ఒక ప్రాంతానికి ఎప్పుడు పరిమితం చేయకూడదు. చాలామంది ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలను విపరీతంగా ఆలకిస్తారు. చాలా బాధలకి ఆయన పాటలు ఓదార్పుగా అనిపిస్తాయి.

దెబ్బకు విజిల్స్ పడ్డాయి: ప్రశంసలు

కేవలం ఎస్పీబీ పాటలను మాత్రమే కాకుండా ఆయన మాటలు కూడా కొన్ని అద్భుతంగా అనిపిస్తాయి. అలానే చాలామంది తెలంగాణ రచయితలు, సంగీత దర్శకులు చేసిన పాటలను కూడా ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో వింటూ ఆదరిస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు అభిప్రాయాలను బట్టి చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేసే చూస్తున్నారు చాలామంది. ఏదేమైనా కళ కు మాత్రం కులం, మతం, ప్రాంతం అనే వాటిని అంటకట్టకూడదు అని గ్రహించాలి.

మొత్తానికి, తరుణ్ భాస్కర్ స్పందన ప్రాంతీయ భేదాలు లేకుండా కళను, ప్రతిభను గౌరవించాలనే సందేశాన్ని ఇచ్చింది. కళకు కులమత ప్రాంతాలు అంటించకూడదని ఆయన వాదనను చాలా మంది సమర్థించారు. ఈ వివాదానికి ఆయన గట్టి సమాధానం ఇచ్చారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.