|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది: దర్శకుడు కరుణ కుమార్‌

Published: 28-10-2025, 9:39 AM
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది: దర్శకుడు కరుణ కుమార్‌

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ ఇటీవలే విడుదలయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 7న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

Key Points

1

'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రం నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

2

దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమా వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

4

చిత్రానికి జీ సంస్థ అండగా నిలిచిందని హీరో తిరువీర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

కరుణ కుమార్ విశ్వాసం: బ్లాక్‌బస్టర్ ఖాయం

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’(The Great Pre Wedding Show ). సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్‌లో సీన్‌ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

తిరువీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హీరో తిరువీర్ మాట్లాడుతూ .. దర్శకుడు రాహుల్ ‌ ఈ కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో హీరో తిరువీర్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

నవంబర్ 7న గ్రాండ్ రిలీజ్

అనగనగా దర్శకుడు సన్నీ మాట్లాడుతూ .. ‘‘పరేషాన్’లో తిరువీర్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అన్ని రకాల ఎమోషన్స్‌ను తిరు అద్భుతంగా పలికిస్తారు. తనకంటూ ఓ మార్క్‌ను తిరు క్రియేట్ చేసుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. ‘ దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి ’ అని చిత్ర నిర్మాత సందీప్ ‌ అగరం అన్నారు .

మొత్తంగా, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంపై చిత్రబృందం, ముఖ్య అతిథులు అపారమైన నమ్మకం వ్యక్తం చేశారు. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.