
📌 Key Points
- ‘ది కేరళ స్టోరీ 2’ షూటింగ్ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే పూర్తయింది.
- సీక్వెల్ చిత్రంలో మొదటి భాగం కంటే మరింత భయంకరమైన సన్నివేశాలు ఉండనున్నాయి.
- మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి రెండు జాతీయ అవార్డులు గెలుచుకుంది.
- ఈ సీక్వెల్ చిత్రం 2026 ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
ఆదాశర్మ నటించిన బ్లాక్‌బస్టర్ ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్ రాబోతోంది. ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండానే ‘ది కేరళ స్టోరీ 2’ షూటింగ్ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. వివాదాస్పదమైనా తొలి భాగం భారీ విజయం సాధించగా, ఈ సీక్వెల్ విడుదలపై ఆసక్తి నెలకొంది.
సీక్వెల్ కోసం ఎదురుచూపులు: కథ, ప్రాముఖ్యత
The kerala Story : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆదాశర్మ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ది కేరళ స్టోరీ.. రాజకీయ, మతపరమైన చర్చకు దారి తీసింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది.. ఈ సినిమా విడుదలైనప్పటినుంచి థియేటర్లలో నుంచి వెళ్లేంతవరకు వరుసగా విమర్శలు ఎదుర్కొంటూ వచ్చింది. కానీ సినిమాకు కలెక్షన్ మాత్రం భారీగానే వసూల్ అయ్యాయి. దాంతో ఈ మూవీ ఆదాశర్మకు బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా మరో సినిమా రాబోతుందంటూ గతంలో వార్తలు వినిపించాయి. కానీ సినిమా గురించి ఎక్కడ ప్రకటించకుండానే షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం..
2023లో ఈ సినిమా విడుదలైనప్పుడు చాలా వివాదాస్పదమైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతే కాదు, ఆదా శర్మ నటించిన ఆ మూవీకి మంచి కలెక్షన్లు రావడంతో పాటుగా రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని జనాలు కూడా అనుకున్నారు. ఇప్పుడు ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా సినిమా షూటింగ్ని పూర్తిచేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది. కేరళ నేపథ్యంలో సీక్వెల్ సినిమా కథ ఉంటుంది.. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ లో చాలా భయంకరమైన సీన్లు ఉంటాయని తెలుస్తుంది. 2026 ప్రారంభంలోనే థియేటర్లలోకి రావచ్చునని సమాచారం. త్వరలోనే ఈ మూవీ పై పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.
రహస్యంగా షూటింగ్ పూర్తి: ఎప్పుడు విడుదల?
తొలి భాగం వివాదం, బాక్సాఫీస్ విజయం
గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. కేరళలో కొన్నేళ్లుగా మహిళలు లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వారు అదృశ్యమైనట్లు వారి ఆచూకీ ఎక్కడనే అంశంతో దర్శకుడు సుదీప్తో సేన్ ‘ద కేరళ స్టోరీ’ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. ఇకసీక్వెల్‌లో భయంకరమైన చీకటి కథను ప్రపంచానికి చూపించనున్నారని ప్రచారం ఉంది. పార్ట్-2 షూటింగ్ పనులను కఠినమైన భద్రతతో ముందుకు సాగుతుంది.. ఈ సినిమాపై ఇప్పటినుంచి భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి ఫిబ్రవరి లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సలహాలు చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.. ఇకపోతే హీరోయిన్ ఆధార్ శర్మ ఈ మధ్య బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2’ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం కంటే భయంకరమైన సన్నివేశాలతో రానున్న ఈ చిత్రం, 2026లో విడుదల కానుందని సమాచారం.


