|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The Raja Saab: ‘ది రాజాసాబ్‌’ పార్ట్ 2 పై దర్శకుడు మారుతి కీలక ప్రకటన

Published: 16-06-2025, 5:06 AM
The Raja Saab: ‘ది రాజాసాబ్‌’ పార్ట్ 2 పై దర్శకుడు మారుతి కీలక ప్రకటన

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా టీజర్ విడుదలైన తర్వాత దర్శకుడు మారుతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ తో తన సహకారం గురించి, ‘ది రాజా సాబ్’ పార్ట్ 2 అవకాశం గురించి ఆయన వివరించారు.

Key Points

1

ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' టీజర్ విడుదలైంది.

2

దర్శకుడు మారుతి, ప్రభాస్ సహకారాన్ని ప్రశంసించారు.

4

సినిమా కంటెంట్‌ను సాగదీయకుండా ఒకే భాగంగా పూర్తి చేస్తామని మారుతి స్పష్టం చేశారు.

‘ది రాజా సాబ్’ టీజర్ విడుదల

హీరో ప్రభాస్ నటించిన రాజా సాబ్ 2 సినిమాపై ( The raja saab) దర్శకుడు మారుతి కీలక ప్రకటన చేశారు. ది రాజా సాబ్ మూవీ టీజర్ ఇవాళ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కోసం భారీ కటౌట్లు పెట్టి మరి.. ది రాజా సాబ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ లో… ముగ్గురు హీరోయిన్లతో పాటు ప్రభాస్ ( Prabhas) అదిరిపోయే నటనతో రెచ్చిపోయారు. అయితే ఈ టీజర్ రిలీజ్ అయిన నేపథ్యంలో దర్శకుడు మారుతి ( Maruthi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హీరో గోపీచంద్ తో ( Gopi chand) సినిమా తీసే సమయంలోనే రాజా సాబ్ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే అప్పుడు పక్కా కమర్షియల్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని… దీంతో నిర్మాతలు… వెనక్కి వెళ్లినా కూడా, ప్రభాస్ మాత్రం తనతో నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. ఈ విషయంలో ప్రభాస్… సపోర్ట్ ఎంతో తనకు లభించిందని వెల్లడించారు దర్శకుడు మారుతి.

మారుతి వ్యాఖ్యలు

అలాగే ది రాజా సాబ్ పార్ట్ 2 సినిమా గురించి ఇప్పుడే తాను చెప్పలేనని వివరించారు. సినిమా అయిపోయిన తర్వాత ఆ విషయంపై ఆలోచిస్తానని వెల్లడించారు. ఏదో సినిమా తీయాలని, పార్ట్ 2 కోసం అస్సలు సాగదీయనని స్పష్టం చేశారు. ఇందులో ఉన్న కంటెంట్ సాగదీసి తీయాల్సిన పనిలేదని.. మారుతి క్లారిటీ ఇచ్చారు.

‘ది రాజా సాబ్’ పార్ట్ 2 అంశం

ప్రభాస్ తో సినిమా చేస్తున్నానంటే మా ఇంట్లో వాళ్ళే నమ్మలేదు #TheRajaSaab pic.twitter.com/tgocHfIOSN

చివరగా, దర్శకుడు మారుతి ‘ది రాజా సాబ్’ పార్ట్ 2 గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేకపోతున్నానని, కథకు అనుగుణంగానే సినిమాను పూర్తి చేస్తానని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.