|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The Raja Saab Song : మీ క్రియేటివిటీ తగలెయ్య.. ఏకంగా సాంగ్‌నే క్రియేట్ చేశారు కదరా..

Published: 10-12-2025, 5:08 AM
The Raja Saab Song : మీ క్రియేటివిటీ తగలెయ్య.. ఏకంగా సాంగ్‌నే క్రియేట్ చేశారు కదరా..
  • AI టెక్నాలజీ ద్వారా ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాలోని ‘సహన’ సాంగ్ వీడియో సృష్టించబడింది.
  • పాట లీక్ అయిందని భావించి అభిమానులు షాక్ అయ్యారు, తర్వాత AI క్రియేషన్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
  • చిత్ర బృందం త్వరలో ‘ది రాజా సాబ్’ నుండి ‘సహన’ అనే రొమాంటిక్ పాటను విడుదల చేయనుంది.
  • మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2025 సంక్రాంతికి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇటీవల AI టెక్నాలజీతో రూపొందించిన ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాలోని ‘సహన’ సాంగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లీక్ అయిందని షాక్ అయిన అభిమానులు, అది AI క్రియేషన్ అని తెలిసి ఆశ్చర్యపోయారు. త్వరలో అసలు పాట విడుదల కానుంది.

AI టెక్నాలజీతో సినిమా పరిశ్రమకు సవాళ్లు

The Raja saab Song: ఇటీవల కాలంలో ఏ ఐ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత నిజం ఏది, అబద్ధం ఏదో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఏఐ టెక్నాలజీ ద్వారా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో రకాల వీడియోలను చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ హీరోయిన్ల పాలిట శాపంగా మారిందని చెప్పాలి. ఏఐ ద్వారా హీరోయిన్ల బోల్డ్ ఫోటోలను రూపొందించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్లు ఈ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రభాస్ సినిమాలోని సహన అనే రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఈ పాట చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిత్ర బృందం విడుదల చేయకుండానే పాట లీక్ అయిందా? అంటూ షాక్ అయ్యారు కానీ అది ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించినదనే విషయం తెలిసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వీడియో పై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మీ క్రియేటివిటీకి జోహార్లు సాంగ్ మాత్రమే ఎందుకు సినిమా కూడా చేసేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక త్వరలోనే ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా నుంచి సహానా(Sahana) అంటూ సాగిపోయే పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు త్వరలోనే ఈ పాట విడుదల కానుంది.

ఇక ఈ పాట ప్రభాస్ అలాగే నిధి అగర్వాల్ మధ్య కొనసాగే రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. త్వరలోనే సెకండ్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ , రిద్ధి కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కామెడీ హర్రర్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ప్రభాస్ లుక్స్ కూడా ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

‘సహన’ సాంగ్ పై అభిమానుల గందరగోళం

Song leaked ??? #SahanaSahana #TheRajaSaab pic.twitter.com/sXDs0oahMp

— 🕶️ (@Liminal_char) December 9, 2025

‘ది రాజా సాబ్’ విడుదల, ప్రమోషన్ల వివరాలు

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జనవరి 9వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. యుఎస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగబోతుందని తెలుస్తుంది .జనవరి ఒకటవ తేదీనీ పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

AI టెక్నాలజీ ఒకవైపు ఆశ్చర్యపరుస్తూనే, మరోవైపు గందరగోళానికి గురిచేస్తోంది. ‘ది రాజా సాబ్’ చిత్ర బృందం త్వరలో ‘సహన’ పాటను విడుదల చేయనుండగా, ఈ AI వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.