|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థియేటర్ల యుద్ధం! SKN బిగ్ వార్నింగ్.. పెద్దోళ్ల పేర్లు బయటపెడతాడట!

Published: 07-01-2026, 12:35 PM
థియేటర్ల యుద్ధం! SKN బిగ్ వార్నింగ్.. పెద్దోళ్ల పేర్లు బయటపెడతాడట!
  • ఎస్‌కేఎన్ బడా నిర్మాతలకు సంచలన వార్నింగ్.
  • రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వ్యాఖ్యలు.
  • థియేటర్ల కేటాయింపుపై పరోక్ష హెచ్చరిక.
  • సపోర్ట్ చేయని వారి పేర్లు చెబుతానని ప్రకటన.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌కేఎన్ సంచలన వార్నింగే హాట్‌ టాపిక్! ‘రాజా సాబ్’ థియేటర్ల సమస్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఎస్‌కేఎన్ అంత ధైర్యంగా ఎవరు వార్నింగ్ ఇచ్చారు? దాని వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చూడాల్సిందే!

SKN అల్టిమేటం: థియేటర్లు ఇవ్వకపోతే అంతే!

టాలీవుడ్ బ‌డా నిర్మాత‌ల‌కు ప్రొడ్యూస‌ర్ ఎస్కేఎన్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్క థియేట‌ర్ ఇస్తే వంద‌సార్లు చెప్పుకుంటాన‌ని, ఒక్క థియేట‌ర్ ఇవ్వ‌క‌పోతే రెండు వంద‌ల సార్లు చెబుతాన‌ని అది త‌న నైజం అని వ్యాఖ్యానించారు. రాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఈ పండ‌గ‌కు విడుద‌ల అవుతున్న అన్ని సినిమాలు మంచి విజ‌యం సాధించాల‌ని అన్నారు. పండ‌గ‌కు అన్ని సినిమాలు వ‌స్తున్న‌ప్పుడు థియేట‌ర్ల స‌మ‌స్య వ‌స్తుంద‌న్నారు.

రాజాసాబ్ నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించిన మిరాయ్ సినిమా మంచిగా ఆడుతున్న ఓజీ సినిమాకు థియేట‌ర్ల‌ను ఇచ్చార‌న్నారు. కాబ‌ట్టి అలాంటి విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించిన‌, ప్ర‌భాస్ న‌టించిన సినిమా వ‌స్తున్న‌ప్పుడు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు అంద‌రూ స‌హ‌క‌రించాల‌న్నారు. అలా స‌హ‌క‌రించిన‌వాళ్ల పేర్లు సినిమా విడుద‌ల త‌ర‌వాత ప్రెస్ మీట్ పెట్టి చెబుతాన‌ని అన్నారు. ఒక్క థియేట‌ర్ ఇస్తే వంద‌సార్లు చెప్పుకుంటాన‌ని, ఒక్క థియేట‌ర్ ఇవ్వ‌క‌పోతే రెండు వంద‌ల సార్లు చెబుతాన‌ని అది త‌న నైజం అని వ్యాఖ్యానించారు. అంటే త‌న వ్యాఖ్య‌ల‌తో ఎస్కేఎన్ ఇన్ డైరెక్ట్ గా థియేట‌ర్ల‌కు ఇవ్వ‌క‌పోతే వాళ్ల పేర్లు బ‌హిరంగంగా చెబుతాన‌ని హెచ్చ‌రించారు.

రాజా సాబ్ కోసమేనా ఈ ధైర్యం?

బడా నిర్మాతల పేర్లు బయటపెడతాడా?

ఎస్కేఎన్ చేసిన ఈ సంచలన ప్రకటన టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ‘రాజా సాబ్’ థియేటర్ల సమస్యపై భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. మరిన్ని లేటెస్ట్, ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్‌ల కోసం మా పేజీని చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.