
ఈ వారం ఓటీటీలో కొత్త కంటెంట్ కోసం వెతుకుతున్నారా? గ్లోబల్ థ్రిల్లర్లు, కామెడీ, కోర్టు డ్రామాలు వంటి విభిన్న జోనర్ల సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఈ వార్తలో వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Key Points
హ్యాపీ గిల్మోర్ 2 నెట్‌ఫ్లిక్స్ లో జూలై 25న రాబోతోంది.
ది శాండ్ మ్యాన్ సీజన్ 2 చివరి సీజన్ గా జూలై 24న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలవుతోంది.
జస్టిస్ ఆన్ ట్రయల్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
షైనీ హ్యాపీ పీపుల్ సీజన్ 2 జూలై 23 నుండి ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.
ఓటీటీలో రాబోతున్న గ్లోబల్ థ్రిల్లర్లు
ఈ వారం ఓటీటీలో ఏదైనా కొత్త కంటెంట్ కోసం చూస్తున్నారా? గ్లోబల్ మూవీస్ ను ఇంట్లో చూసేయాలనుకుంటున్నారా? అయితే ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి. ఈ వారం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ వైడ్ ఇంగ్లిష్ సినిమాలు ఇంట్రెస్ట్ రేకెత్తిస్తున్నాయి. హ్యాపీ గిల్మోర్ 2 లో ఆడమ్ సాండ్లర్ పునరాగమనం నుండి థ్రిల్ వరకు ఎంటర్టైన్మెంట్ కు కొదవ లేదు.
మూడు దశాబ్దాల తర్వాత హ్యపీ గిల్మోర్ సీక్వెల్ వస్తోంది. ఆడమ్ సాండ్లర్ హ్యాపీ గిల్మోర్ 2 ఓటీటీ లోకి దూసుకొస్తోంది. ఈ మూవీ జూలై 25 న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హ్యాపీ గిల్మోర్ 2లో జూలీ బోవెన్, క్రిస్టోఫర్ మెక్ డొనాల్డ్ వంటి ఒరిజినల్ కాస్ట్ ఫేవరెట్స్.. బ్యాడ్ బన్నీ, ట్రావిస్ కెల్స్, మార్గరెట్ క్వాల్లీ వంటి కొత్త యాక్టర్లు నటించారు. సాండ్లర్ కుమార్తెలు కూడా మిక్స్ లో ఉండటం, ప్రో గోల్ఫ్ క్రీడాకారులు సరదాగా చేరడంతో ఈ సీక్వెల్ నోస్టాల్జియా, గందరగోళం, హాస్యాన్ని ఒకటిగా కలిపేసి ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేస్తోంది.
కామెడీ మరియు కోర్టు డ్రామా సినిమాలు
హాలీవుడ్ ఫ్యాంటసీ మూవీ ది శాండ్ మ్యాన్ సీజన్ 2 వచ్చేస్తుంది. ఇదే చివరి సీజన్ కానుంది. వాల్యూమ్ 2 చివరి ఎపిసోడ్ లు జూలై 24 న నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే విడుదలవుతాయి. పాపులర్ డిసి కామిక్ శాండ్ మ్యాన్ క్యారెక్టర్ ఆధారంగా ఈ శాండ్ మ్యాన్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్యాంటసీ డ్రామాలో టామ్ స్టురిడ్జ్ డ్రీమ్ పాత్రలో నటించాడు. ఇందులో మరింత థ్రిల్, ఫ్యాంటసీ అంశాలు, మ్యాజిక్ అన్నీ ఉంటాయి.
కోర్టు డ్రామా థ్రిల్లర్లను ఇష్టపడే ఆడియన్స్ కు మంచి ట్రీట్ అందించేందుకు జస్టిస్ ఆన్ ట్రయల్ వచ్చేస్తోంది. ఈ రోజే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జస్టిస్ ఆన్ ట్రయల్ ను చూడొచ్చు. జస్టిస్ జూడీ షెండ్లిన్ జస్టిస్ ఆన్ ట్రయల్ తో తిరిగి వచ్చారు. ఈ కోర్టు సిరీస్.. రియల్ లైఫ్ కేసుల్లోని డ్రామాను ఆడియన్స్ కు పంచుతుంది.
సినిమాలు చూసేందుకు ప్లాట్‌ఫామ్‌లు
టీనేజ్ హోలీ వార్ టీన్ మానియా రియల్ లైఫ్ స్టోరీలో ఏం జరిగిందనేది బేస్ చేసుకుని షైనీ హ్యాపీ పీపుల్ సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేస్తుంది. షైనీ హ్యాపీ పీపుల్ జూలై 23 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది అమెరికాలోని అతిపెద్ద యువ మంత్రిత్వ శాఖలలో ఒకదాని చీకటి సత్యాలను బహిర్గతం చేస్తుంది.
ఈ వారం విడుదలవుతున్న విభిన్న జోనర్ల సినిమాలు, సిరీస్‌లతో మీ ఓటీటీ అనుభవం మరింత ఆసక్తికరంగా మారుతుంది. మీకు నచ్చిన జోనర్‌ను ఎంచుకొని ఆనందించండి!


