|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థగ్ లైఫ్ నిషేధం: కమల్‌ హాసన్‌కు పెద్ద షాక్.. కర్ణాటకలో థగ్ లైఫ్ పై నిషేధం!

Published: 30-05-2025, 6:31 AM
థగ్ లైఫ్ నిషేధం: కమల్‌ హాసన్‌కు పెద్ద షాక్.. కర్ణాటకలో థగ్ లైఫ్ పై నిషేధం!

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారితీశాయి. కన్నడ సంఘాల ఆగ్రహంతో, ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో నిషేధించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Key Points

1

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ సంఘాల ఆగ్రహం

2

కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా నిషేధం

4

కన్నడ రక్షణ వేదిక కూడా నిషేధానికి మద్దతు

కమల్ హాసన్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి

కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్‌పై వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే క్షమాపణ చెప్పాలని కమల్‌కు డెడ్‌లైన్‌ విధించిన కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమల్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఎఫ్‌సీసీ కర్ణాటకలో థగ్‌ లైఫ్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన గడువులోగా క్షమాపణలు చెప్పకపోతే నిషేధం అమల్లోకి వస్తుందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి సారా గోవిందు స్పష్టం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ అనుకూల సంస్థల డిమాండ్లకు కూడా తమ మద్దుతు ఉంటుందని ఆయన తెలిపారు.

కాగా.. ఇటీవల బెంగళూరులో జరిగన థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది. ఆయన వ్యాఖ్యలపై కన్నడ భాష సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో కమల్ సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే  కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో నిషేధించింది.  ఇ‍ప్పటికే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశారని కమల్ హాసన్‌పై కర్ణాటక రక్షణ వేదిక ఫిర్యాదు చేసింది.

కన్నడ సంఘాల ఆగ్రహం, నిరసనలు

కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం

కమల్ హాసన్ క్షమాపణలు చెప్పే వరకు కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనకు అవకాశం లేదు. ఈ వివాదం కన్నడ మరియు తమిళ సినీ పరిశ్రమల మధ్య విభేదాలను వెల్లడించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.