|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థగ్ లైఫ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్, త్రిష, శింబు

Published: 05-06-2025, 5:20 AM
థగ్ లైఫ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్, త్రిష, శింబు

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మరియు దర్శకధీరుడు మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ సినిమా రివ్యూ ఇది. శింబు, త్రిష నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందో చూద్దాం.

Key Points

1

కమల్ హాసన్, శింబు, త్రిష నటన అద్భుతంగా ఉందా?

2

38 ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబో సక్సెస్ అయిందా?

4

అంచనాలను థగ్ లైఫ్ అందుకుందా?

కథానాయికలు మరియు వారి పాత్రలు

నటీనటులు: కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, జోజు జార్జ్, నాజర్, సాన్య మల్రోత్రా, ఐశ్వర్య లక్ష్మీ, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్ తదితరులు.

సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్

ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, శివ అనంత్

విడుదల తేది: జూన్ 5, 2025

సినిమా ప్రధాన అంశాలు

నాయగన్ (నాయకుడు) తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం థగ్ లైఫ్. సుమారు 38 ఏళ్ల తర్వాత ఇద్దరు లెజండరీ కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ భారీ అంచనాల నడుమ ఇవాళ (జూన్ 5) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి థగ్ లైఫ్ రివ్యూ లో తెలుసుకుందాం.

అన్నదమ్ములు అయిన రంగరాయ శక్తి రాజన్ (కమల్ హాసన్), మాణిక్యం (నాజర్) ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్. ఓరోజు వీరిపై పోలీసులు అటాక్ చేస్తారు. కట్ చేస్తే భవిష్యత్తులో బిజినెస్ పరంగా రంగరాయ శక్తి రాజన్

అదే సమయంలో న్యూస్ పేపర్స్ వేసే ఓ ఫ్యామిలీలో తండ్రి చనిపోతాడు. అతని కొడుకు అమర్ (శింబు), కూతురు చంద్ర తప్పిపోతారు. దాడి సమయంలో రంగరాయను అమర్ కాపాడుతాడు. దాంతో అమర్‌ను అన్నగా, తండ్రిగా తీసుకుని వెళ్లి చూసుకుంటాడు.

అమర్ చెల్లిని తానే వెతికి పెడతానని మాటి ఇస్తాడు రంగరాయ. కొన్నాళ్ల తర్వాత ఒకరిని చంపిన కేసులో రంగరాయన్ శక్తి రాజన్ జైలుకు వెళ్తాడు. అధికారం అంతా అమర్‌కు ఇచ్చి వెళ్తాడు. జైలు నుంచి రంగరాయ శక్తి రాజన్ తిరిగి వచ్చేసరికి పరిస్థితి అంతా మారుతుంది. శత్రువులతో అమర్ చేతులు కలుపుతాడు. రంగరాయ శక్తి రాజన్‌పై అటాక్స్ జరుగుతుంటాయి.

ఆ తర్వాత ఏమైంది? దాడుల నుంచి శక్తి రాజన్ ఎలా తప్పించుకున్నాడు? అమర్ మారిపోడానికి కారణం ఏంటీ? అమర్ చెల్లెలు ఏమైంది? అమర్‌ను చంద్రను శక్తిరాజన్ కలిపాడాడా? శక్తి రాజన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అమర్-శక్తి యుద్ధం ఎక్కడి వరకు వెళ్లింది? నాజర్, జోజు జార్జ్, త్రిష , అభిరామి, మహేష్ మంజ్రేకర్, అలీ ఫజల్ పాత్రల ప్రాధాన్యత ఏంటీ? అనేది తెలియాలంటే థగ్ లైఫ్ మూవీ చూడాల్సిందే.

చివరి తీర్పు

థగ్ లైఫ్ ఒక గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. 38 ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా అంటే చాలా హైప్స్ ఉన్నాయి. కానీ, ఆ అంచనాలను అంతగా అందుకోలేకపోయింది థగ్ లైఫ్ చిత్రం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో నాయగన్ వంటి కల్ట్ క్లాసిక్ చూసిన అభిమానులు థగ్ లైఫ్‌తో కాస్తా నిరాశ చెందారనే చెప్పొచ్చు.

ఇక థగ్ లైఫ్ సినిమా కథ ఏంటో ప్రచార చిత్రాల్లోనే పూర్తిగా చూపించేశారు. కాపాడిన పిల్లాడిని కొడుకులా చూసుకున్న తండ్రికి అతని నుంచి ద్రోహం ఎదురైతే ఎలా ఉంటుంది, అందుకు గల కారణాలు ఏంటీ అనే ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగింది. అయితే, మొదటి 20 నిమిషాలు మాత్రం చాలా ఎగ్జైటింగ్‌గా సాగుతుంది.

ఆ తర్వాత సినిమా అంతా దాదాపుగా రొటీన్ ఫ్లేవర్‌లోనే ఉంటుంది. చాలా వరకు సన్నివేశాలు ఊహించేసేలా ఉంటాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ముఖ్యంగా కమల్-శింబు మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, ఏఆర్ రెహమాన్ మ్యూజికి అంతగా వర్కౌట్ కాలేదు. ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. టెక్నికల్ వాల్యూస్ రిచ్‌గానే ఉన్నాయి. కమల్ హాసన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్‌తోపాటు శింబు తన నటనతో అదరగొట్టాడు.

మిగతా భారీ తారాగణం అంతా పరిధి మేర నటించారు. అయితే, వారి క్యారెక్టరైజేషన్ అంత బలంగా రాసుకోకపోవడం మైనస్. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ డ్రామా అయిన థగ్ లైఫ్ మూవీని యాక్షన్ సీక్వెన్స్, కమల్, శింబు యాక్టింగ్ కోసం చూడొచ్చు.

మొత్తంమీద, 38 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ మరియు మణిరత్నం కాంబో సినిమా అంచనాలను అందుకుందో లేదో థియేటర్ లో చూడాలి. గ్యాంగ్ స్టర్ కథాంశం, నటీనటుల నటన చూసి తీర్పు చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.