|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2027లో టాలీవుడ్ బాక్సాఫీస్ యుద్ధం! ప్రభాస్, మహేష్ బాబుల మధ్య అగ్ని పరీక్ష!

Published: 27-03-2026, 12:35 AM
2027లో టాలీవుడ్ బాక్సాఫీస్ యుద్ధం! ప్రభాస్, మహేష్ బాబుల మధ్య అగ్ని పరీక్ష!
  • 2027లో ప్రభాస్, మహేష్ బాబు సినిమాలు విడుదల కానున్నాయి.
  • బాలీవుడ్ ‘దురంధర్ 2’ మూవీ ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది.
  • ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ తెరకెక్కనుంది.
  • ఈ ఏడాది సమ్మర్ లో రామ్ చరణ్, ప్రభాస్ సినిమాలు విడుదల కానున్నాయి.

టాలీవుడ్ లో 2027లో భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ఈ సినిమాల విడుదల కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

2027లో భారీ సినిమాలు విడుదల

Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది కొత్త సినిమాల సందడి మామూలుగా ఉండదు. ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలన్నీ సంక్రాంతి నుంచి ఒక్కొక్కటిగా విడుదల అవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. అయితే ఈ ఏడాది సమ్మర్ లో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది, ప్రభాస్ నటించిన ఫౌజీ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. ఈ ఏడాదిలో ముఖ్యంగా రిలీజ్ కావాల్సిన సినిమాలు అంటే ఈ రెండే అని సినీ అభిమానులు అంటున్నారు. ఇక మిగిలిన సినిమాలు అన్నీ కూడా దాదాపు ఈ ఏడాదిలోని థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇక వచ్చే ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు 2027 లో రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోల సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఈ సంవత్సరం వచ్చిన సినిమాలు పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుంటే.. అప్కమింగ్ సినిమాలపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే ఈ సంవత్సరం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘దురంధర్ 2’ ఇండియన్ సినిమా రికార్డు ను బ్రేక్ చేసింది.. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ రోజు రోజుకు వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఇప్పటికే 700 కోట్లను వసూల్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.. ఈ ఏడాది ఈ మూవీ రికార్డులను చేసే సినిమాలు అయితే రాలేవని తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఇయర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రాబోయే అతి పెద్ద భారీ సినిమాల మధ్య భారీ యుద్ధమే జరగబోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు నటిస్తున్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. మరి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ప్రభాస్, మహేష్ బాబు సినిమాల పోటీ

టాలీవుడ్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాజ సాబ్ ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. ఈ ఏడాదిలో ఆయన నటించిన ఫౌజీ మూవీ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.. ఇక వచ్చే ఏడాది అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఆ సినిమానే స్పిరిట్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా అవుతుంది.. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయ్యి అంచనాలను పెంచేసింది..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. రాజమౌళి సినిమాలకు మామూలు డిమాండ్ ఉండదన్న విషయం తెలిసిందే.. ఈ మూవీపై కూడా అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేయడాది థియేటర్లలోకి రాబోతుంది.

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి

ఈ రెండు సినిమాలతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీ కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. మొత్తానికి 2027 స్టార్ హీరోల సినిమాలతో టఫ్ వార్ గా మారబోతుంది.. మరి ఏ సినిమా విన్నర్గా నిలుస్తుందో? ఏది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వస్తువులను సొంతం చేసుకుంటుందో చూడాలి..

మొత్తానికి 2027లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది. ప్రభాస్, మహేష్ బాబు సినిమాలు ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.