|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tollywood : రేపే సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖులు భేటీ.. ఎవరెవరు వెళ్తున్నారంటే? అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు బాలకృష్ణ..

Published: 14-06-2025, 5:49 AM
Tollywood : రేపే సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖులు భేటీ.. ఎవరెవరు వెళ్తున్నారంటే? అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు బాలకృష్ణ..

థియేటర్స్ సమస్యల నేపథ్యంలో, రేపు సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. బాలకృష్ణ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు ఈ భేటీకి హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

Key Points

1

రేపు సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖులు భేటీ.

2

బాలకృష్ణ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు సీఎంను కలుస్తారు.

4

థియేటర్స్, టికెట్ రేట్లు ప్రధాన చర్చాంశాలు.

సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖుల భేటీ

Tollywood : ఇటీవల థియేటర్స్ ఇష్యూ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ థియేటర్స్, టాలీవుడ్ పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు సీఎం ని కలిసారా అని పవన్ ప్రశ్నించడంతో టాలీవుడ్ పెద్దలు సీఎంని కలవడానికి సిద్ధం అయ్యారు. గతంలో కరోనా తర్వాత థియేటర్స్ కోసం, టికెట్ రేట్ల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు అప్పటి సీఎం వైఎస్ జగన్ ని కలిశారు. దీంతో ఈ సారి సీఎం చంద్రబాబుని కలవడానికి ఎవరెవరు వెళ్తున్నారు అనేదానిపై ఆసక్తి నెలకొంది.

తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం అప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్తే ఈసారి బాలకృష్ణ ఆధ్వర్యంలో వెళ్తున్నట్టు తెలుస్తుంది. రేపు మొదట పవన్ కళ్యాణ్ ని కలిసి అనంతరం పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు టాలీవుడ్ ప్రముఖులు. ఇప్పటివరకు వచ్చిన లిస్ట్ ప్రకారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ అయ్యేవారిలో డైరెక్టర్ లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు, హీరోలు.. బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని.. ఇలా దాదాపు 35 నుంచి 40 మంది హాజరు అవ్వనున్నారు.

బాలకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం

అయితే గతంలో చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్లడం, ఈసారి అసలు చిరంజీవి వెళ్లకపోవడంతో ఆసక్తి నెలకొంది. దీంతో ఈసారి బాలకృష్ణ ఆధ్వర్యంలో అంతా వెళ్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరూ సీఎం చంద్రబాబుకి బాగా క్లోజ్ కాబట్టి ప్రత్యేకంగా చిరంజీవి వెళ్లాల్సిన అవసరం లేదేమో పలువురు భావిస్తున్నారు.

థియేటర్స్, టికెట్ రేట్లపై చర్చ

రేపు సాయంత్రం సీఎం చంద్రబాబును 4 గంటలకు కలవనున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మీటింగ్ లో ఏం చర్చిస్తారు, ప్రభుత్వం ఏం చెబుతుంది, సినీ ప్రముఖులు ఏం కోరతారు అని ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

ఈ భేటీ ఫలితంగా టాలీవుడ్ పరిశ్రమకు ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. ప్రభుత్వం మరియు సినీ ప్రముఖుల మధ్య సామరస్యపూర్వక చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.