
టాలీవుడ్ నటి రీతూ చౌదరి మరియు బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని రీల్స్ షూట్ చేశారు. ఈ రీల్స్ సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యాయి. రీతూ చౌదరి దుస్తులపై విమర్శలు వస్తున్నాయి.
Key Points
రీతూ చౌదరి మరియు అఖిల్ తిరుమలలో రీల్స్ షూట్ చేశారు.
రీతూ చౌదరి ధరించిన లంగా ఓణిపై విమర్శలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో కామెంట్లతో కలకలం రేగుతోంది.
తిరుమల సన్నిధిలో సరైన దుస్తులు ధరించాలని నెటిజన్ల ఆగ్రహం.
తిరుమలలో రీతూ చౌదరి, అఖిల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాను విపరీతంగా వాడుకొని పాపులర్…. ఇండస్ట్రీలో రాణించేవారు ఎక్కువ అవుతున్నారు. అలాంటి వారిలో రీతు చౌదరి ఒకరు. సోషల్ మీడియా స్టార్ గా పేరుగాంచిన రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ.. యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
అటు జబర్దస్త్ కామెడీ షో, కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా మెరిసింది ఈ అందాల తార రీతూ చౌదరి. ఇది ఇలా ఉండగా తాజాగా రీతూ చౌదరి తిరుమల శ్రీవారి సన్నిధిలో మెరిసింది. ఎప్పుడు పొట్టి బట్టలు వేసే రీతూ చౌదరి… తిరుమలలో మాత్రం… సాంప్రదాయ బద్ధంగా లంగా ఓణి ధరించింది. అటు బిగ్ బాస్ స్టార్ అఖిల్ కూడా ఆమెతో కనిపించాడు. ఇద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
రీల్స్ పై విమర్శలు
అయితే దీనికి సంబంధించిన రీల్.. ను నటి రీతూ చౌదరి తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. సాంప్రదాయంగా బట్టలు వేసింది కానీ… తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా.. లంగా ఓణి సెట్ చేసుకుందని కొంతమంది ఫైర్ అవుతున్నారు. తిరుమల సన్నిధిలో అలా… కొంగు కిందికి వేసుకోకూడదని… అలా చేస్తే కేసులు పెట్టాల్సిందేనని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొంతమంది ఈ ఇద్దరి జంట బాగుందని లవ్ సింబల్స్ పెడుతున్నారు.
సోషల్ మీడియా చర్చ
A post shared by 𝐀𝐤𝐡𝐢𝐥 𝐒𝐚𝐫𝐭𝐡𝐚𝐤𝐤 (@akhilsarthak_official)
తిరుమలలో రీతూ చౌదరి మరియు అఖిల్ రీల్స్ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దుస్తులపై విమర్శలు, కేసు పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయి.


