|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం! విశాఖలో గోపీచంద్ ఇల్లు.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్?

Published: 25-03-2026, 11:35 AM
సంచలనం! విశాఖలో గోపీచంద్ ఇల్లు.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్?
  • హైదరాబాద్‌లో కాకుండా విశాఖలో ఇల్లు కొన్న తొలి టాలీవుడ్ హీరోగా గోపీచంద్ నిలిచారు.
  • షీలా నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గోపీచంద్ ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తయింది.
  • ప్రభుత్వ కార్యాలయాల్లో వస్తున్న మార్పులపై గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు.
  • గోపీచంద్ నిర్ణయం ఇతర సినీ ప్రముఖులకు ప్రేరణగా నిలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

టాలీవుడ్ హీరో గోపీచంద్ విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనుగోలు చేశారు. షీలా నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల పనితీరును మెరుగుపరచడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

విశాఖలో గోపీచంద్ ఇల్లు కొనుగోలు

Tollywood Hero: టాలీవుడ్ హీరోలందరూ ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఇళ్లను కొనుగోలు చేసి అక్కడే స్థిరపడదం మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్న విషయమే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో చిన్న మార్పు కనిపిస్తోంది. మాచో స్టార్ గోపీచంద్ విశాఖపట్నంలో.. ఒక ఇల్లు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రముఖ హీరో ఇల్లు తీసుకోవడం అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది.

గోపీచంద్ తన కొత్త ఇంటి రిజిస్ట్రేషన్ పనుల కోసం విశాఖలోని షీలా నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు ఒక భయం ఉంటుంది. పనులు ఆలస్యం అవుతాయి, గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే గోపీచంద్‌కు అక్కడ ఎదురైన అనుభవం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది.

కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటికే ఆయనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా వేగంగా పూర్తయింది. ఎటువంటి ఆలస్యం లేకుండా అధికారులు తమ పనిని చక్కగా నిర్వహించారు. డిజిటల్ విధానంలో పనులు సులభంగా పూర్తి కావడం గోపీచంద్‌ను ఆశ్చర్యానికి గురిచేసిందంట.

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గోపీచంద్ అనుభవం

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధమైన మార్పులు రావడం చాలా మంచి విషయమని చెప్పారు. సిబ్బంది పనితీరు చాలా మెరుగ్గా ఉందని ప్రశంసించారు. ఒక సెలబ్రిటీ వచ్చినప్పటికీ సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అధికారులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు.

ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖలో గోపీచంద్ ఇల్లు కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, అక్కడి ప్రభుత్వ కార్యాలయ పనితీరుపై ఆయన ఇచ్చిన స్పందన కూడా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సేవలు క్రమంగా మెరుగుపడుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

నెటిజన్ల స్పందన, ఇతర హీరోలకు ప్రేరణ

గోపీచంద్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర హీరోలకు కూడా ప్రేరణగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు కొనుగోలు చేస్తారా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.

మొత్తానికి గోపీచంద్ విశాఖలో ఇల్లు కొనడం, ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ఆయన స్పందించడం ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఇతర నటులకు కూడా స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.