
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ పీక్ లో ఉన్నారు. పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఇప్పుడు ముంబై వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ అది కేవలం మూడు నెలల పాటు మాత్రమే.
Key Points
అల్లు అర్జున్ ముంబైలో మూడు నెలలు ఉండనున్నారు.
పుష్ప 2 సినిమా విజయం తరువాత అట్లీతో సినిమా షూటింగ్.
సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం కోసం ముంబై షూటింగ్.
కుటుంబం హైదరాబాద్ లోనే ఉంటుంది.
అల్లు అర్జున్ ముంబై ప్రయాణం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పుష్ప ( Pushpa) సినిమాతో ఆయన క్రేజ్ ప్రపంచ స్థాయికి పెరిగిపోయింది. అంతేకాదు ఇటీవల… సీఎం రేవంత్ రెడ్డి ( Cm revanth reddy ) చేతుల మీదుగానే గద్దర్ అవార్డు అందుకొని… తన హీరోఇజం ను నిరూపించుకున్నాడు. అయితే అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు హైదరాబాద్ ను ( Hyderabad) వదిలి వెళ్ళిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పుష్ప 2 తర్వాత అట్లీ సినిమా
పర్మినెంట్ గా హైదరాబాద్ ను వదలడం లేదు కానీ… మూడు నెలలు మాత్రం ఇంటికి దూరంగా ఉండనున్నాడు. అది కూడా సినిమా షూటింగ్ కోసం కావడం గమనార్హం. హైదరాబాద్ ను వదిలి ముంబైలో ( Mumbai) మూడు నెలల పాటు అల్లు అర్జున్ ఉండబోతున్నారట. పుష్ప 2 బంపర్ హిట్ కావడంతో ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
మూడు నెలల షూటింగ్ షెడ్యూల్
సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీగా ఈ సినిమా వస్తోంది. అయితే ఈ సినిమా షెడ్యూల్ ముంబై లోనే ప్రారంభించబోతున్నారట. అక్కడే దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు షూటింగ్ షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ ను వదిలి ముంబైలోనే మూడు నెలల పాటు అల్లు అర్జున్ ఉంటాడని సమాచారం అందుతుంది. తన ఫ్యామిలీ మొత్తం హైదరాబాదులోనే ఉంచి అల్లు అర్జున్ మాత్రం ఒంటరిగా వెళ్తారు.
అల్లు అర్జున్ తన కెరీర్ విషయంలో ఎల్లప్పుడూ కొత్త విషయాలను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటారు. ముంబై షూటింగ్ అతనికి కొత్త అనుభవాలను అందిస్తుందని ఆశిద్దాం.


