
టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. తన కెరీర్ లోని ఎదుగుదల మరియు ఇటీవలి సినిమాల ఫలితాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Key Points
నితిన్ తన తాజా చిత్రం 'తమ్ముడు' డిజాస్టర్ తర్వాత రెమ్యూనరేషన్ తగ్గించారు.
వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎల్లమ్మ' సినిమాలో నటించేందుకు నితిన్ ఒప్పుకున్నారు.
'ఎల్లమ్మ' సినిమాను రెమ్యూనరేషన్ లేకుండా చేయాలని నితిన్ నిర్ణయించుకున్నారు.
సినిమా సక్సెస్ అయిన తర్వాత మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకోవాలని నితిన్ ఆలోచన.
నితిన్ కెరీర్ లో ఎదురైన కష్టాలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ.. హీరో నితిన్ కు (Nithin) ఉన్న ప్రత్యేకత అంతా కాదు. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పైకి వచ్చాడు. అప్పట్లో జయం, దిల్, సై లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న హీరో నితిన్… ఆ తర్వాత డిజాస్టర్ బాట పట్టాడు. ఇక మళ్లీ 2012 తర్వాత ఇష్క్ సినిమాతో గాడిలో పడ్డాడు హీరో నితిన్. ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకున్నాడు.
‘ఎల్లమ్మ’ సినిమా మరియు నితిన్ నిర్ణయం
అయితే ఈ మధ్యకాలంలో మళ్లీ నితిన్ చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇటీవల తమ్ముడు (Thammudu) సినిమాతో కూడా బొక్క బోర్లా పడ్డాడు హీరో నితిన్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ తరుణంలోనే ఈ సినిమా విషయంలో రెమ్యూనరేషన్ కూడా కాస్త తగ్గించే తీసుకున్నాడట హీరో నితిన్. ఇక అటు బలగం సినిమాతో పాపులర్ అయిన వేణు తో ఎల్లమ్మ సినిమా చేయబోతున్నాడట ఆ హీరో నితిన్.
ప్రొడ్యూసర్లతో నితిన్ అనుబంధం
ఈ సినిమాలో మొదట నానిని అనుకున్నప్పటికీ.. మళ్లీ నితిన్ చేతికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే తమ్ముడు సినిమా డిజాస్టర్ కావడంతో… ఎల్లమ్మ సినిమాను ఫ్రీగా చేయాలని హీరో నితిన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఎల్లమ్మ సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత… రెమ్యూనరేషన్ అడగాలని అనుకుంటున్నాడట నితిన్. ప్రొడ్యూసర్ కష్టాలు నితిన్ కుటుంబానికి బాగా తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడట.
నితిన్ తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ‘ఎల్లమ్మ’ సినిమా హిట్ అయితే ఆయనకు మంచి పేరు వస్తుంది.


