|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు చిత్రానికి దెబ్బ! తమిళ సినిమాకు రెట్టింపు రేటా? టాలీవుడ్‌లో టికెట్ యుద్ధం!

Published: 10-04-2026, 11:05 AM
తెలుగు చిత్రానికి దెబ్బ! తమిళ సినిమాకు రెట్టింపు రేటా? టాలీవుడ్‌లో టికెట్ యుద్ధం!
  • హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లలో ‘డెకాయిట్’ కంటే ‘LIK’ టికెట్ ధర రూ.25 అధికం.
  • తెలుగు సినిమా కంటే తమిళ డబ్బింగ్ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై నెటిజన్ల ఆగ్రహం.
  • అడవి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ కంటే డబ్బింగ్ సినిమాకు ఎక్కువ రేటు పెట్టడం విమర్శలకు దారితీసింది.
  • టికెట్ రేట్ల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అడవి శేష్ నటించిన ‘డెకాయిట్’ సినిమా కంటే ప్రదీప్ రంగనాథన్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా ‘LIK’ టికెట్ ధర ఎక్కువగా ఉండటంతో దుమారం రేగింది.

మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరల వ్యత్యాసం

Ticket Price : ‘ పక్కింటి పుల్ల కూర రుచి’ అన్న సామెత మరో సారి నిజమైనట్టే కనిపిస్తుంది.విషయంలోకి వెళితే అడవి శేష్ స్వయంగా స్క్రీన్ ప్లే అందిస్తూ అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా’డెకాయిట్’.క్షణం,గూఢచారి సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా చేసిన షనీల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీ ఇది.మరోవైపు కోలీవుడ్ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్ , కృతి శెట్టి జంటగా ఎస్.జె.సూర్య కీ రోల్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమా ‘LIK’ ( లవ్ ఇన్స్యూరెన్స్ కంపెని).సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పై తెరకెక్కిన ఈ సినిమాని నయనతార ప్రొడ్యూస్ చేయడం విశేషం.

తెలుగు కన్నా తమిళ డబ్బింగ్ సినిమాకే 25 రూపాయలు ఎక్కువ

ఇక అడవి శేష్’డెకాయిట్’,ప్రదీప్ రంగనాథ్ ‘LIK’ సినిమాలు ఈ రోజు అంటే ఏప్రిల్ 10న ఒకేసారి థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే.అయితే హైదరాబాద్ లోకి కొన్ని మల్టీ ఫ్లెక్స్ లు అన్నపూర్ణ స్టూడియోస్ వంటి భారీ బ్యానర్‌లో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన పక్కా తెలుగు సినిమా ‘డెకాయిట్’ కోసం మల్టీప్లెక్స్‌లలో 225 ఫిక్స్ చేస్తే, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన తమిళ డబ్బింగ్ సినిమా ‘LIK’ కి మాత్రం ఏకంగా 250 వసూలు చేయడమే ఇక్కడ విశేషం.అంటే తెలుగు సినిమా కన్నా తమిళ డబ్బింగ్ సినిమాకే 25 రూపాయలు ఎక్కువన్న మాట.

నెటిజన్ల ఆగ్రహం, విమర్శలు

పక్క రాష్టం హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్

దీంతో మన సొంత హీరోలకంటే పక్క రాష్టం హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.అసలు అడవి శేష్,మృణాల్ ఠాకూర్ వంటి క్రేజీ కాంబినేషన్ ఉన్న సినిమా కంటే, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న డబ్బింగ్ సినిమాకు ఎక్కువ రేట్ పెట్టడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఎకిపారేస్తున్నారు నెటిజన్లు. ఇక మరికొంత మంది మాత్రం డబ్బింగ్ సినిమాలకి ఎక్కువ రేట్ పెడితే అయినా మన సినిమాలు చూస్తారని ఇలా పెట్టి ఉంటారు అంటూ సెటైర్స్ వదులుతున్నారు.ఏది ఏమైనా  ఒకేరోజు రిలీజ్ అయిన అడవి శేష్ ‘డెకాయిట్’, ప్రదీప్ రంగనాథ్ ‘LIK’ సినిమాల మధ్య టికెట్ రేట్ వార్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపొయింది.

తెలుగు మార్కెట్‌పై తమిళ తంబీల డామినేషన్

సోషల్ మీడియాలో టికెట్ వార్

ఇదిలా ఉంటె లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తుంటే ‘డెకాయిట్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 5 నుంచి 6 కోట్ల గ్రాస్ వసూలు చేసేలా కనిపిస్తుంటే,’LIK’ సినిమా కూడా యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి 2 కోట్లకు పైగానే ఓపెనింగ్స్ రాబట్టేలా కనిపిస్తోంది.అయితే, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా అన్నపూర్ణ స్టూడియోస్ వంటి సంస్థలు ప్రేక్షకులకు భారం పడకూడదని తక్కువ రెట్లు పెడితే తమిళ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ప్రదీప్ రంగనాథన్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది.ఏది ఏమైనా  తెలుగు మార్కెట్‌పై తమిళ తంబీల డామినేషన్  మాములుగా లేదుగా అంటూ డిబేట్స్ పెట్టేస్తున్నారు మూవీ లవర్స్.చూడాలి మరి మన హీరోలని పక్కన పెట్టేసి తమిళ తంబీలకి  వేస్తున్న రెడ్ కార్పెట్ కల్చర్ ముందు ముందు ఎటు వెళ్తుందో !

Tags Adivi Sesh Decoyt Decoyt Movie Ticket Price LIK Movie Ticket Rate Pradeep Ranganathan LIK Telugu vs Tamil Movies Share

మొత్తానికి అడవి శేష్ ‘డెకాయిట్’, ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సినిమాల టికెట్ రేట్ల వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.