|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బండారం బయటపెట్టిన మేకప్ ఆర్టిస్ట్.. సంచలనంగా మారిన ఇన్‌స్టా పోస్ట్

Published: 15-10-2025, 12:07 AM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బండారం బయటపెట్టిన మేకప్ ఆర్టిస్ట్.. సంచలనంగా మారిన ఇన్‌స్టా పోస్ట్

టాలీవుడ్‌లో మరో కొత్త వివాదం సంచలనం రేపుతోంది. ఓ స్టార్ హీరోయిన్‌పై ఆమె వద్ద పనిచేసిన మేకప్ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తీవ్ర ఆరోపణలు చేసింది. వేధింపులు, డబ్బులు ఎగ్గొట్టడం వంటి అంశాలపై చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది, ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై మేకప్ ఆర్టిస్ట్ వేధింపులు, డబ్బులు ఇవ్వలేదని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆరోపణలు.

2

హీరోయిన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా వేధింపులలో భాగమయ్యారని మేకప్ ఆర్టిస్ట్ వెల్లడి.

4

సంచలన ఆరోపణలు చేసిన మేకప్ ఆర్టిస్ట్, ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ పేర్లు బయటపడలేదు.

టాలీవుడ్‌లో కొత్త వివాదం

గత కొద్ది రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో పలు వివాదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల డింపుల్ హయాతీ ఓ ఇద్దరు అమ్మాయిలతో ఇంట్లో పని చేపించుకొని డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తోందని పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన భర్తతో పాటు డింపుల్ హయాతీ వేధిస్తున్నారంటూ ఇద్దరు అమ్మాయిలు కేసు కూడా పెట్టారు. ఇక ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే.. ఇండస్ట్రీలో మరో సంఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ వద్ద మేకప్ ఆర్టిస్ట్ పనిచేస్తున్న ఓ మహిళ తనను వేధిస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది.

మేకప్ ఆర్టిస్ట్ ఇన్‌స్టా పోస్ట్ సంచలనం

హీరోయిన్‌తో పాటు ఆమె తల్లి కూడా ఇబ్బంది పెడుతోందని సంచలన ఆరోపణలు చేసింది. ‘‘గత కొన్నాళ్లుగా ఓ స్టార్ హీరోయిన్ నన్ను వేధిస్తోంది. ఆమెతో పాటు, కుటుంబ సభ్యులు కూడా ఇందులో భాగమయ్యారు. దక్షిణాదిలో వాళ్లకు తక్కువ మొత్తానికి లేదంటే ఫ్రీగా పనిచేసినట్లు ఇక్కడ కూడా పనిచేస్తారని అనుకుంటున్నారు. మాకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. నాకు నీతో పనిచేయాలని లేదు. కాబట్టి ఇకపై ఫోన్ మెసేజ్ చేయొద్దని చెబుతున్నాను. ఆమె కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు.

ఎవరా స్టార్ హీరోయిన్?

మిగతావాళ్లు సారీ చెబుతున్నారు. కానీ నాకు మీతో పని చేయాలని లేదు. మా డబ్బులు నొక్కేయడం ఆపండి. లేదంటే ఈ సారి మీ పేర్లు బయటపెడతాను’’ అని రాసుకొచ్చింది. కానీ ఆ స్టార్ హీరోయిన్ పేరును మాత్రం రివీల్ చేయలేదు. అలాగే తన పేరు కూడా బయటపడకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమార్ రేపుతోంది. అసలు ఆ హీరోయిన్ ఎవరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పని చేసిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పేరు బయటపెట్టని స్టార్ హీరోయిన్, మేకప్ ఆర్టిస్ట్ మధ్య సాగుతున్న ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలు టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో, ఆ హీరోయిన్ ఎవరనేది వెల్లడవుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.