|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెడలో తాళి వేసుకుంటే అత్యాచారాలు ఆపేస్తారా.. నెటిజన్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్

Published: 04-11-2025, 5:37 AM
మెడలో తాళి వేసుకుంటే అత్యాచారాలు ఆపేస్తారా.. నెటిజన్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్

హీరో రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి మంగళసూత్రం ధరించకపోవడంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఓ నెటిజన్‌కు చిన్మయి (Chinmayi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తాళి వేసుకుంటే అత్యాచారాలు ఆగుతాయా అంటూ సమాజంలో మహిళల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది.

Key Points

1

రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి మంగళసూత్రం ధరించకపోవడంపై వ్యాఖ్యలు.

2

తాళి కచ్చితంగా ధరించాలనే సంప్రదాయాన్ని తాను సమర్థించనన్న రాహుల్.

4

మంగళసూత్రం లైంగిక దాడులను ఆపదని, మహిళలకు భద్రత లేదని చిన్మయి వాదన.

రాహుల్ రవీంద్రన్ ‘మంగళసూత్రం’పై వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) త్వరలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)సినిమాతో రాబోతున్నారు. ఇక ఈ మూవీ నవంబర్ 7న థియేటర్స్‌లోకి రాబోతుండగా.. ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్య చిన్మయి మంగళసూత్రాన్ని వేసుకోకపోవడంపై స్పందించారు. పెళ్లి తర్వాత మహిళలు తాళిని కచ్చితంగా ధరించాలనే సంప్రదాయాన్ని నేను సమర్థించనంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఎప్పుడు తాళి వేసుకో అని చెప్పను అని అన్నాడు.

ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొందరు సపోర్ట్ చేస్తుండగా.. ఓ నెటిజన్ ఆయనపై గౌరవం పోయిందని ఓ పోస్ట్ పెట్టాడు. అలాగే రాహుల్‌పై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై చిన్మయి (Chinmayi)ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయి కౌంటర్ వేసింది. ‘‘మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను ఆపలేదు. పుట్టుక నుంచి మరణించేవరకు ఈ సమాజంలో మహిళలకు ఏ దశలోనూ భద్రత లేదు. చాలాచోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నారు. అప్పుడే పుట్టిన పసికందులను కూడా దారుణాలు ఆగడం లేదు కదా’’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

చిన్మయి గట్టి కౌంటర్: అసలు సమస్య ఎక్కడ?

మహిళల భద్రతపై చిన్మయి ప్రశ్నలు

మంగళసూత్రంపై రాహుల్ రవీంద్రన్, చిన్మయి వ్యాఖ్యలు సమాజంలో మహిళల భద్రతపై తీవ్ర చర్చకు దారితీశాయి. కేవలం సంప్రదాయాలకే పరిమితం కాకుండా, మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.