|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ స్టోరీస్: పాత కథలతో విసిగిన ప్రేక్షకుడు – కొత్తదనం కోసం ఎదురుచూపు!

Published: 24-03-2026, 7:05 AM
టాలీవుడ్ స్టోరీస్: పాత కథలతో విసిగిన ప్రేక్షకుడు - కొత్తదనం కోసం ఎదురుచూపు!
  • గ్రాఫిక్స్, బడ్జెట్లు పెరిగినా కథల్లో కొత్తదనం లేదు.
  • ప్రేక్షకులు రియలిస్టిక్ సినిమాలను ఆదరిస్తున్నారు.
  • పాత ఫార్ములా కథలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి.
  • క్రియేటివ్ లేజీనెస్ కారణంగానే కొత్త కథలు రావడం లేదు.

టాలీవుడ్‌లో కథల కొరత వేధిస్తోంది. గ్రాఫిక్స్, బడ్జెట్లు పెరిగినా కథల్లో మాత్రం పాత చింతకాయ పచ్చడి రుచి చూపిస్తున్నారు. ప్రేక్షకులు మాత్రం కొత్తదనం కోసం ఆరాటపడుతున్నారు. టాలీవుడ్ కథకుల ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది.

కథల ఎంపికలో అవుట్‌డేటెడ్ ట్రెండ్స్

Tollywood Stories: మనం ముందుకు వెళ్తున్నామా…లేక అదే చోట ఆగిపోయి పరుగు తీస్తున్నామా? గ్రాఫిక్స్ పెరిగాయి, బడ్జెట్లు ఆకాశాన్ని తాకాయి..గ్లోబల్ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. కానీ, ‘కథ’ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మన అడుగులు ఎందుకు తడబడుతున్నాయి? మనం బాహుబలి, RRR లాంటి విజువల్ వండర్స్‌ని చూసి మురిసిపోతున్నాం. అది గర్వించదగ్గ విషయమే. కానీ అదే గ్రాండియర్ వెనుక.. సాదాసీదా కథలు మసాలా పూసుకుని మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ఈరోజు ఆడియన్ ని తక్కువ అంచనా వేయడానికి అస్సల్ లేదు . ‘స్క్విడ్ గేమ్’ లోని మనుషుల నైజాన్ని చూస్తున్నాడు.మనీ హైస్ట్ లోని మైండ్ గేమ్స్ ఆస్వాదిస్తున్నాడు. పక్కనే ఉన్న మలయాళంలో మంజుమ్మల్ లాంటి రియలిస్టిక్ సినిమాల్లో తనని తాను వెతుక్కుంటున్నాడు. ప్రేక్షకుడి టేస్ట్ మారింది..కానీ మన సినిమా ఫార్ములా మాత్రం మారలేదు. థియేటర్‌లోకి వెళ్తే.. ఇంకా అదే విలన్ గ్యాంగ్,అదే హీరోయిన్ టీజింగ్ సాంగ్స్, కథను చంపేసే రొట్ట కామెడీ. ఇది ‘క్రియేటివిటీ ‘లేకపోవడం కాదు.. ఇది ‘క్రియేటివ్ లేజీనెస్’.

గతంలో వచ్చిన సక్సెస్ షాడోలో సేఫ్ గేమ్ ఆడటం బిజినెస్ కి మంచిదేమో కాని , ఆర్ట్ కి కాదు. ఒక యానిమల్ సినిమా హిట్ అయితే.. అందరూ వయొలెన్స్ వెనుక పరిగెత్తడం, ఒక కాంతారా ఆడితే అందరూ మట్టి కథల వెంట పడటం.. ఇది ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం కాదు, ఇదో కాపీ పేస్ట్ కల్చర్. కేరాఫ్ కంచరపాలెం, బలగం లాంటి సినిమాలు … అక్కడ కోట్లు లేవు, కేవలం కోట్లాది మందికి కనెక్ట్ అయ్యే ‘సోల్ ‘ ఉంది. నిజమైన సినిమా అంటే ..పాత్రల్లో నిజాయితీ ఉండాలి.సంఘర్షణలో జీవితం కనిపించాలి.

సినిమా అంటే బొమ్మ కాదు.. ఒక అనుభవం!

ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథలు కావాలి

రిపిటేషన్ విసుగు తెప్పిస్తుంది. విసుగు అబ్జెక్షన్ కి దారి తీస్తుంది. గుర్తుంచుకోండి.. ఆడియన్ ని మోసం చేయలేం. అతనికి భారీతనం కంటే.. నువ్వు చెప్పే కథలో ‘సత్యం’ కావాలి. ఎందుకంటే సినిమా అంటే కేవలం తెరపై బొమ్మ పడటం కాదు.. సినిమా అంటే ఒక అనుభవం! మలయాళం ‘ఆవేశం’ …అందులో గ్యాంగ్‌స్టర్ ఉన్నాడు, వయొలెన్స్ ఉంది. కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం ఎంత కొత్తగా, ఫన్నీగా, ఫ్రెష్‌గా ఉంది! మనం మాత్రం ఇంకా ‘నలుగురిని నరికితేనే మాస్’ అనే పాత కాలపు ఆలోచనల్లోనే ఉన్నాం. హిట్ అయిన సినిమా ఫార్ములాను మళ్ళీ మళ్ళీ వాడే పనిలో ఉన్నాం . ఒక కమర్షియల్ సినిమా అంటే – హీరో ఇంట్రడక్షన్ ఫైట్, రెండు కామెడీ సీన్లు, ఒక ఐటెం సాంగ్, సెకండ్ హాఫ్‌లో ఒక సెంటిమెంట్ సీన్. ఈ టెంప్లేట్ ఇప్పుడు తుప్పు పట్టిపోయింది. ‘మత్తు వదలరా’ లేదా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’…వీటిలో హీరోలు రౌడీలను గాలిలో ఎగరేయరు. వాళ్లు మనలాంటి మనుషులే. వాళ్ల సమస్యలు మన సమస్యలే. ఆ ‘రిలేటబిలిటీ’నే ఇప్పుడు ప్రేక్షకుడికి కావాలి.

ఆడియన్ ఇప్పుడు ‘క్రిటిక్’ మాత్రమే కాదు.. ‘అనలిస్ట్’

ప్రేక్షకుడు ‘ప్రేక్షకుడు’ మాత్రమే కాదు.. ఒక ‘క్రిటిక్’ గతంలో ప్రేక్షకులు సినిమాను చూసి ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు బంచులు బంచులుగా బ్రేక్ డౌన్ చేసేస్తున్నారు. ‘దృశ్యం’ సినిమా… ప్రేక్షకులు ఎందుకు అంతగా ఇష్టపడ్డారు? అందులో కండలు తిరిగిన విలన్ లేడు, ఊహించని ఫైట్లు లేవు. కేవలం ‘మెదడు’ తో ఆడే గేమ్ ఉంది. ప్రేక్షకుడికి ఇప్పుడు ‘ట్విస్ట్’ కావాలి, ‘లాజిక్’ కావాలి. “హీరో కాబట్టి కొట్టేస్తాడు” అనే లాజిక్ లేని సీన్లను ఈ తరం ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నాడు .

ఫార్ములా కథలకు స్వస్తి చెప్పాల్సిన సమయం

ఒకప్పుడు సినిమా అంటే ఒక ‘అద్భుతం. ఇప్పుడు సినిమా అంటే ఒక ‘ప్యాకేజీ’. హీరో డేట్స్ + ఫారిన్ లొకేషన్స్ + ఒక మాస్ సాంగ్ కట్ చేస్తే వంద కోట్ల కలెక్షన్లు. ఈ పాత చింతకాయ పచ్చడే ఆడియన్స్ వద్దనేది. చూశారుగా ‘సప్త సాగరదాచె ఎల్లో’ సినిమాలో ప్రేమను ఎంత గాఢంగా చూపించారో. ‘మహారాజా’ లో ఆ స్క్రీన్‌ప్లే మాయాజాలం ఎలా ఉందో. మన దగ్గర టాలెంట్ లేదని కాదు.. ఆ రొటీన్ ఫార్ములాని బ్రేక్ చేసే డేర్ కావాలి . మనం గ్లోబల్ సినిమాతో..గ్రాండియర్ ..విజువల్స్ లో మాత్రమే కాదు, ఎమోషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో కూడా పోటీ పడాలి. రొటీన్ అనే రొంపిలో నుంచి బయటకు వచ్చి.. కొత్తగా ఆలోచించాలి ఎందుకంటే.. ఆడియన్స్ ఎప్పుడో అప్‌డేట్ అయ్యారు. అవ్వాల్సింది ఇక మేకర్సే !

టాలీవుడ్ కొత్త ట్రెండ్‌ను అందిపుచ్చుకోవాలి. పాత ఫార్ములా కథలకు స్వస్తి చెప్పి, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త కథలను అందించాలి. అప్పుడే టాలీవుడ్ మళ్ళీ వెలుగుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.