
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 19 నుండి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది.
Key Points
టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్' ఓటీటీలోకి!
ఆగస్టు 19న అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ ప్రారంభం.
బాక్సాఫీస్ వద్ద రూ. 6000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులకు, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ అభిమానులకు అద్భుతమైన విజువల్ ఫీస్ట్.
మిషన్ ఇంపాజిబుల్ ఓటీటీ రిలీజ్
హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’ ( Mission Impossible) ఓటీటీలోకి రానుంది .. సుమారు రెండు నెలల తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చేసింది . హాలీవుడ్ ఫ్రాంఛైజీల్లో మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు . ఆ సిరీస్‌లో భాగంగా 8వ సినిమాగా వచ్చిన ‘మిషన్ ఇంపాసిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో టామ్ క్రూజ్ చేసిన సాహసాలు అత్యంత ప్రమాధకరంగా ఉన్నాయని హాలీవుడ్ మీడియా కూడా కథనాలు రాసింది .
టామ్ క్రూజ్ సాహసాలు
ఆగష్టు 19 న అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు రానున్నట్లు ఒక పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేశారు . తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది . బాక్సాఫీస్ వద్ద సుమారు రూ . 6 వేల కోట్ల వరకు ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది . సుమారు రూ . 3400 కోట్ల వరకు ఈ చిత్రం కోసం నిర్మాతలు ఖర్చు చేశారు . క్రిస్టోఫర్ మేక్‌క్వారీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు .
తెలుగు ప్రేక్షకులకు శుభవార్త
సిరీస్ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్‌తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్ ఇంపాజిబుల్. సిరీస్ మొదటినుంచి ఒకే టీమ్‌ను మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్‌లోని ఓ మెంబరైన లూథర్ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్‌ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌ను ఇష్టపడేవాళ్ళకి… అలాగే ఈ సిరీస్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.
మొత్తంమీద, ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ అనేది యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులకు తప్పక చూడవలసిన చిత్రం. అమెజాన్ ప్రైమ్ లో దీనిని తెలుగులో ఆస్వాదించండి.


