
📌 Key Points
- సీతారామం: దుల్కర్, మృణాల్ లవ్ స్టోరీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది!
- నాని, మృణాల్ జంటగా ‘హాయ్ నాన్న’ చిత్రం.. ఎమోషనల్ లవ్ ట్రీట్!
- ఏ మాయ చేశావె: చైతూ, సమంత కెమిస్ట్రీతో యూత్ గుండెల్లో నిలిచిపోయిన చిత్రం!
- ఆర్య: బన్నీ కెరీర్‌ను మార్చేసిన ట్రెండింగ్ లవ్ స్టోరీ!
టాలీవుడ్ లవర్స్ కోసం ఒక అదిరిపోయే న్యూస్! టాప్ 10 రొమాంటిక్ తెలుగు మూవీస్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు మీ ప్రేమను మరింత చిగురింపచేస్తాయి. వెంటనే లిస్ట్ చూసేయండి!
దుల్కర్, మృణాల్ మ్యాజిక్: సీతారామం!
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రమిది. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 2022లో విడుదలైన బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎవరూ లేని ఒక సైనికుడికి, ఒక రాజుల కుటుంబానికి చెందిన ప్రిన్సెస్‌కి మధ్య సాగే లవ్ స్టోరీ ఇది. చూస్తున్నసేపు ఆ ప్రేమలో, రొమాన్స్ లో మునిగిపోతారు.
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రమిది. శౌర్యువ్ దర్శకత్వం వహించారు. కూతురుకి తన లవ్ స్టోరీని చెప్పే చిత్రం. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగే లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్. లవర్స్ మాత్రం చూస్తున్నంత సేపు ఆ ప్రపంచంలో ఉండిపోతారు. 2023లో విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది.
లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్‌లో ప్రేమని పీక్‌లోకి తీసుకెళ్లే చిత్రం `ఏ మాయ చేశావె`. నాగచైతన్య, సమంత జంటగా నటించారు. గౌతమ్ మీనన్ రూపొందించారు. 2010లో విడుదలై బ్లాక్ బస్టర్ గా, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. చైతూ, సమంత ల మధ్య లవ్, కెమిస్ట్రీ కట్టిపడేస్తుంది.
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ `ఫిదా`. వరుణ్ తేజ్, సాయిపల్లవి నటించారు. తెలంగాణ అమ్మాయి, ఎన్‌ఆర్‌ఐ అబ్బాయి మధ్య లవ్ స్టోరీని ఆవిష్కరించే చిత్రమిది. పాటలు, లవ్ స్టోరీ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. సాయిపల్లవి కట్టిపడేస్తుంది.
హాయ్ నాన్న: ఎమోషనల్ లవ్ స్టోరీ!
రొమాంటిక్ లవ్ స్టోరీస్‌లో మాస్టర్ పీస్‌గా చెప్పుకునే చిత్రం `గీతాంజలి`. మణిరత్నం రూపొందించిన చిత్రమిది. 1989లో విడుదలై, పెద్ద హిట్ అయ్యింది. నాగార్జునకి బ్రేక్ ఇచ్చింది. ఇందులో ఆయన సరసన గిరిజా షెట్టర్ హీరోయిన్‌గా నటించింది. మణిరత్నం టేకింగ్, నాగార్జున, గిరిజ నటన కట్టిపడేస్తుంది. ఈ మూవీ చూస్తే ఆ హ్యాంగోవర్ నుంచి రావడానికి చాలా రోజులు పడుతుంది.
తెలుగులో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీస్‌లో `ఆర్య` ఒకటి. ఇదొక టిఫికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. అల్లు అర్జున్, అనురాధా మెహతా జంటగా నటించారు. శివ బాలాజీ కీలక పాత్ర పోషించారు. సుకుమార్ రూపొందించారు. 2004లో విడుదలైన ఈ మూవీ అల్లు అర్జున్ లైఫ్‌నే మార్చేసింది. ఈ మూవీ చూస్తుంటే మతిపోవాల్సిందే.
సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ `బొమ్మరిల్లు`. భాస్కర్ రూపొందించిన ఈ చిత్రం 2006లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీ యూత్‌ని ఓ ఊపు ఊపేసింది. లవర్స్ ఇప్పటికీ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
ఏ మాయ చేశావె: యూత్ ఐకాన్!
`మళ్లీ మళ్లీ ఇది రాని రోజు`.. శర్వానంద్, నిత్యా మీనన్ నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రమిది. క్రాంతి మాధవ్ రూపొందించారు. రొమాంటిక్ లవ్ స్టోరీలో పీక్ ని చూపించే చిత్రమిది. స్లోగా సాగినా, హృదయాన్ని కట్టిపడేస్తుంది. ఎమోషనల్ డెప్త్, మ్యూజిక్ మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది. 2015లో విడుదలై మంచి ఆదరణ పొందింది.
రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన మూవీ `7/జీ బృందావనం కాలనీ`, సెల్వరాఘవన్ రూపొందించారు. సుమన్ శెట్టి కామెడీ రోల్ చేశారు. ఆద్యంతం నవ్విస్తూ, హృదయాన్ని కదలించే చిత్రమిది. రొమాన్స్ తోపాటు ఎమోషన్స్ కట్టిపడేస్తుంది. గుండె బరువెక్కుతుంది. ఇది 2004లో విడుదలై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
రొమాంటిక్ లవ్ స్టోరీస్‌లో నాని నటించిన మరో మూవీ `శ్యామ్ సింగరాయ్` కూడా ఉంది. రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. నాని, సాయిపల్లవి, కృతి శెట్టి నటించారు. ఇందులో లవ్ స్టోరీ పొయెటిక్‌గా ఉంటూ కట్టిపడేస్తుంది. ఈ మూవీ 2021లో విడుదలై ఆకట్టుకుంది.
ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి! మీ అభిమాన తారల గురించి, సినిమాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ ని ఫాలో అవ్వండి.


