
టాలీవుడ్‌లో అనేకమంది హీరోలు రెండో వివాహం చేసుకున్నారు. ఈ కథనంలో ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకున్న టాప్ 5 హీరోల గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ నుంచి నాగచైతన్య వరకు వారి ప్రేమ కథలు, వివాహాలు, విడాకులు చూద్దాం.
Key Points
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మరియు అన్నా లెజినోవాతో వివాహాలు.
నాగచైతన్య, సమంత మరియు శోభిత ధూళిపాళ్ళతో వివాహాలు.
కమల్ హాసన్, వాణి గణపతి మరియు సారికతో వివాహాలు.
ప్రకాష్ రాజ్, లలిత కుమారి మరియు పోనీ వర్మతో వివాహాలు.
ఇద్దరు హీరోయిన్లతో వివాహ బంధం
ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకున్న హీరోలలో టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ ముందు ఉన్నారు. రేణు దేశాయ్ తో ప్రేమలోపడి పెళ్లి చేసుకున్న పవన్, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత రష్యన్ నటి అన్నా లెజినోవాతో మరోసారి ప్రేమలో పడ్డాడు. మనస్పర్ధల కారణంగా రేణు దేశాయ్ తో విడాకులు తీసుకుని అన్నాను పెళ్లాడాడు పవన్. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ OG సినిమాతో ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓజీ ఫీవర్ నడుస్తోంది.
అక్కినేని నట వారసుడు, నాగార్జున కొడుకు నాగ చైతన్య మొదట హీరోయిన్ సమంతను ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో మనస్పర్ధల కారణంగా వారు విడిపోయారు. ఆ తర్వాత మరో హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల ప్రేమలో పడిన నాగ చైతన్య 2024 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు.
ప్రముఖ హీరోల ప్రేమ జీవితం
సౌత్ స్టార్ యాక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ మొదట నటి వాణి గణపతిని పెళ్లి చేసుకుని విడిపోయారు. తర్వాత నటి సారికను వివాహం చేసుకున్నారు. వీరికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కూతుళ్లు. సారికతో కూడా ఆయన విడాకులు తీసుకుని కొంత కాలం సీనియర్ హీరోయిన్ గౌతమితో సహజీవనం చేశాడు. ఆమెతో కూడా విడిపోయి ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నాడు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మొదట నటి అమృతా సింగ్‌ను 1991లో పెళ్లి చేసుకున్నారు. 2004లో విడిపోయి, 2012లో నటి కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విడాకులు మరియు రెండో వివాహాలు
సౌత్ సినిమాల్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చకున్న ప్రకాష్ రాజ్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట నటి లలిత కుమారిని 1994లో పెళ్లి చేసుకుని, 2009లో విడిపోయారు. 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆయన రెండో వివాహం చేసుకున్నారు.
ఈ ప్రముఖ హీరోల ప్రేమ, వివాహ, విడాకుల కథలు సినీ ప్రేమికులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటాయి. వారి వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం రెండూ ఆసక్తికరమైనవి.


