|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో హవా

Published: 30-06-2025, 11:14 AM
ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో హవా

ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, గత వారం ఓటీటీలో ఎక్కువ మంది వీక్షించిన టాప్ 5 సినిమాలు మరియు వెబ్ సిరీస్‌ల జాబితాను ఈ కథనంలో చూద్దాం. నెట్‌ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియోల ఆధిపత్యం కొనసాగుతోంది.

Key Points

1

గత వారం ఓటీటీలో 'రైడ్ 2' అత్యధిక వ్యూస్ సాధించింది.

2

'పంచాయత్' సీజన్ 4 వెబ్ సిరీస్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

4

తెలుగు, తమిళం, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ లభించింది.

టాప్ 5 ఓటీటీ సినిమాలు

ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో తెలుసా? ఆర్మాక్స్ మీడియా తాజాగా గత వారానికి సంబంధించిన జాబితాను రిలీజ్ చేసింది. దీని ప్రకారం జూన్ 23 నుంచి జూన్ 29 వరకు ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఏవో చూద్దాం. ఇండియన్ ఆడియెన్స్, అందులోనూ కనీసం 30 నిమిషాల పాటు చూసిన వాటినే లెక్కలోకి తీసుకొని ఈ జాబితాను తయారు చేశారు.

ఆర్మాక్స్ మీడియా ప్రకారం ఓటీటీ ల్లో ఎక్కువ మంది చూసిన సినిమాల విషయానికి వస్తే వీటిలో హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైడ్ 2 (Raid 2) తొలి స్థానంలో ఉంది. ఈ సినిమాను గత వారం 4.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండో స్థానంలో అక్షర్ కుమార్ నటించిన మరో హిందీ మూవీ కేసరి ఛాప్టర్ 2 ఉంది.

టాప్ 5 ఓటీటీ వెబ్ సిరీస్

జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి 3.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మూడోస్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తెలుగు డైరెక్టర్ తొలి హిందీ మూవీ జాట్ 2.5 మిలియన్ వ్యూస్ తో నిలిచింది. నాలుగు, ఐదు స్థానాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలోని మూవీస్ ఉన్నాయి. ఇమ్రాన్ హష్మి నటించిన గ్రౌండ్ జీరో (2.4 మిలియన్ వ్యూస్), విజయ్ సేతుపతి తమిళ మూవీ ఏస్ (2.3 మిలియన్ వ్యూస్) టాప్ 5లో ఉన్నాయి.

ఇక ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ విషయానికి వస్తే గత వారం ఎక్కువ మంది చూసిన సిరీస్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోని పంచాయత్ సీజన్ 4 నిలిచింది. ఈ సిరీస్ కు 8.8 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. రెండో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోని స్క్విడ్ గేమ్ సీజన్ 3 (4.8 మిలియన్ వ్యూస్) ఉంది. మూడోస్థానంలో జియోహాట్‌స్టార్ లో ఉన్న క్రిమినల్ జస్టిన్ సీజన్ 4 నిలిచింది. ఈ సిరీస్ కు 4.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ప్రాముఖ్యత

అంతకుముందు రెండు వారాల పాటు టాప్ లో ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు మూడోస్థానానికి పడిపోయింది. ఇక నెట్‌ఫ్లిక్స్ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 ఉంది. దీనికి 3.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ 3.4 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.

మొత్తంమీద, గత వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ లభించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల ప్రాముఖ్యత కనిపించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.