|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యష్ ‘టాక్సిక్’ మూవీలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత? హీరోని మించి ఎవరు తీసుకుంటున్నారు?

Published: 23-02-2026, 3:35 AM
యష్ 'టాక్సిక్' మూవీలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత? హీరోని మించి ఎవరు తీసుకుంటున్నారు?
  • యశ్ ‘టాక్సిక్’ మూవీలో 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, నిర్మాణంలో భాగస్వామ్యం కూడా ఉంది.
  • కియారా అద్వానీ ఈ సినిమాలో రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
  • నయనతార రూ. 12 కోట్లు, హుమా ఖురేషి రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
  • మార్చి 19న ‘టాక్సిక్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీలో నటీనటుల రెమ్యూనరేషన్ గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో యష్ ఎంత తీసుకుంటున్నాడు? మిగతా నటీనటుల పారితోషికం ఎంత అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యష్ ‘టాక్సిక్’ మూవీ రెమ్యూనరేషన్ వివరాలు

Toxic Movie:కన్నడ స్టార్ హీరో యశ్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సీరియల్స్ ద్వారా కన్నడ ఇండస్ట్రీలో తన నటనా ప్రయాణాన్ని మొదలుపెట్టిన యశ్.. ఆ తర్వాత ప్రాంతీయంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. కానీ ఎప్పుడైతే ప్రశాంత్ నీళ్ (Prashanth neel) దర్శకత్వంలో కేజిఎఫ్ 1, కేజిఎఫ్ 2 చిత్రాల చేశాడో.. ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. 2022 లో కేజిఎఫ్2 సినిమా విడుదలవ్వగా.. అప్పటినుంచి తన తదుపరి సినిమాపై అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూశారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohandas) దర్శకత్వంలో పాన్ వరల్డ్ లెవెల్లో ‘టాక్సిక్’ సినిమాని ప్రకటించారు.

పైగా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పటినుంచి ఈ సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ సినిమాలో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదు మంది హీరోయిన్స్ నటిస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అటు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ వంటివి సినిమా అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా యశ్ ఇందులో కనిపించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా తీస్తూ ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

హీరోయిన్ల పారితోషికం వివరాలు

మార్చి 19వ తేదీన టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటువంటి తరుణంలోనే ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతనే విషయంపై సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. మరి హీరో కాకుండా ఈ సినిమాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.యశ్ టాక్సిక్ సినిమా కోసం 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తో పాటూ ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం చేత లాభాలలో కూడా వాటా తీసుకుంటారు.

మిగతా నటీనటుల రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani) ఈ సినిమా కోసం రూ .15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. దీనిని బట్టి చూస్తే యశ్ తర్వాత హీరోయిన్స్ లో ఈమె అధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ నయనతార (Nayanthara) 12 కోట్ల రూపాయలు, అలాగే మరొక హీరోయిన్ హుమా ఖురేషి (Huma Qureshi) కోటి రూపాయలు, తారా సుతారియా రూ .2కోట్లు, రుక్మిణీ వసంత్ 1.5 కోట్ల రూపాయలు వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి. మొత్తానికి రెమ్యూనరేషన్ విషయంలో కూడా టాక్సిక్ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది.

మార్చి 19న విడుదల కానున్న ‘టాక్సిక్’

ఒక సినిమా విషయానికొస్తే.. గీతు మోహన్దాస్ దర్శకత్వంలో భారతీయ కాలపు గ్యాంగ్ స్టర్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు..

మొత్తానికి ‘టాక్సిక్’ మూవీలో నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుండగా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.