
📌 Key Points
- యష్ “టాక్సిక్” సినిమా జూన్ 4న విడుదల కావడం కష్టమేనని తాజా వార్తలు.
- మార్చి 19 నుండి జూన్ 4కు వాయిదా పడిన మూవీ మరోసారి ఆలస్యం కావచ్చు.
- వరుస వాయిదాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉందని విశ్లేషకుల హెచ్చరిక.
- “టాక్సిక్” టీమ్ త్వరగా విడుదల తేదీని ప్రకటించాలని అభిమానుల ఆకాంక్ష.
రాక్ స్టార్ యష్ అభిమానులకు షాకింగ్ న్యూస్! భారీ అంచనాలతో వస్తున్న “టాక్సిక్” సినిమా విడుదలపై మరోసారి సస్పెన్స్ నెలకొంది. జూన్ 4న వస్తుందనుకున్న చిత్రం మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందా? పూర్తి వివరాలు ఇక్కడ!
వాయిదాల పరంపర: కారణం ఇదేనా?
కె.జి.యఫ్ చిత్రం తర్వాత కన్నడ నటుడు యశ్ ‘టాక్సిక్’ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాను మొదలుపెట్టే ముందు ఆయన చాలా కాలం గ్యాప్ తీసుకుని అనేక కథలు విని చివరకు ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేశాడు. సినిమా ఓకే అయిన తర్వాత కూడా షూటింగ్ కాస్త నెమ్మదిగానే ముందుకు సాగింది. అయితే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలను చూసిన తర్వాత ప్రేక్షకులు ఇది భారీ బడ్జెట్‌తో, ఎంతో స్టైలిష్‌గా రూపొందుతున్న సినిమా అని భావించారు. అందుకే మేకింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నారని అనుకున్నారు. ఇలా అన్నీ బాగానే సాగుతున్న సమయంలో, ఈ చిత్రాన్ని మార్చ్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అభిమానుల్లో ఆందోళన: ఓపెనింగ్స్‌పై ప్రభావం!
అదే తేదీన ‘ధురంధర్: ది రివేంజ్’ విడుదలకు సిద్ధంగా ఉండటంతో, ఈ రెండు సినిమాల మధ్య భారీ క్లాష్ ఏర్పడుతుందని అందరూ భావించారు. ఇలాంటి సమయంలోనే ‘టాక్సిక్’ టీమ్ ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది. దీంతో, ‘ధురంధర్: ది రివెంజ్’పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అదే తేదీన విడుదల చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడుతుందని భావించి మేకర్స్ వెనక్కి తగ్గారని చాలా మంది అనుకున్నారు. తర్వాత ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తేదీకి దగ్గరలో ఇతర పెద్ద సినిమాలు విడుదల తేదీలు ప్రకటించకపోవడంతో ‘టాక్సిక్’కి క్లియర్ రన్ దొరికినట్టే కనిపించింది.
జూన్ 4న వస్తుందా? కొత్త తేదీ ఎప్పుడు?
అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా జూన్ 4న కూడా విడుదల కావడం కష్టమేనని తెలుస్తోంది. అదే జరిగితే ఈ సినిమాపై అంచనాలు తగ్గే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన సినిమాను వరుసగా వాయిదా వేస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని, జూన్ 4న విడుదల చేస్తే మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని వారు సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి ఈ సినిమాను నిజంగా జూన్ 4న విడుదల చేస్తారా? లేక మరో కొత్త తేదీని ప్రకటిస్తారా? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
“టాక్సిక్” విడుదల తేదీపై కొనసాగుతున్న సస్పెన్స్ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. చిత్ర యూనిట్ త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వేచి చూడండి!


