|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యష్ ‘టాక్సిక్’ టీజర్ విధ్వంసం! 8 ఏళ్ల తర్వాత ఊహించని షాక్.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్!

Published: 20-02-2026, 4:06 AM
యష్ 'టాక్సిక్' టీజర్ విధ్వంసం! 8 ఏళ్ల తర్వాత ఊహించని షాక్.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్!
  • యష్ ‘టాక్సిక్’ టీజర్ విడుదల: భారీ అంచనాలతో మార్చి 19న సినిమా రిలీజ్!
  • టీజర్లో యష్ వైలెంట్ లుక్: యాక్షన్ సీన్లు గగుర్పాటు కలిగిస్తున్నాయి!
  • ‘KGF’ తర్వాత 8 ఏళ్లకు గడ్డం లేకుండా యష్ సర్‌ప్రైజ్!
  • టీజర్లో యష్ వాడిన అసభ్య పదాలు హాట్ టాపిక్!

రాకింగ్ స్టార్ యష్ చాలా కాలం తర్వాత ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. టీజర్లో యష్ లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

వైలెంట్ కింగ్‌గా యష్ రచ్చ!

కేజీఎఫ్ చేసిన చాలా కాలం తరువాత.. యష్ నటించిన మరో మూవీ ‘టాక్సిక్’ ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. భారీ అంచనాల మధ్య  మార్చి 19న ఈసినిమా విడుదల కానుంది. రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

గతంలో వచ్చిన యశ్ క్యారెక్టర్ టీజర్ పెద్ద హిట్టయింది. ఆ టీజర్‌ను ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. “అందరినీ ఎదిరించి బతకలేం” అనే డైలాగ్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది.

8 ఏళ్ల తర్వాత గడ్డం లేని లుక్

టీజర్‌లో “ఈసారి యుద్ధమే వేరు” అనే డైలాగ్ ఉంది. యశ్ ఇందులో వైలెంట్ కింగ్‌గా గర్జించాడు. 1 నిమిషం 55 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్, యశ్‌ను డ్యూయల్ షేడ్‌లో చూపిస్తూ ఆసక్తి రేపుతోంది.

ఈ టీజర్ మొత్తం యాక్షన్, ఫైట్స్, రక్తపాతంతో నిండిపోయింది. ఇది చూసి చాలామంది భయపడుతున్నారు కూడా. కొన్ని యాక్షన్ సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. యష్ నటన అయితే అమేజింగ్.. అభిమానులు ఇది చూసి షాక్ అవుతున్నారు.

టీజర్లో అసభ్య పదాలు.. షాక్!

ఈ సినిమాలో యశ్ గడ్డం లేకుండా కనిపించాడు. ‘KGF’ సినిమా వచ్చి దాదాపు 8 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి యశ్ గడ్డంతోనే ఉన్నాడు. ఇప్పుడు గడ్డం లేకుండా యశ్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఈ సినిమాలో యశ్ రావణుడి లాంటి లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ను చాలామంది మెచ్చుకుంటున్నారు. టీజర్ రిలీజైన అరగంటలోనే మూడు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి.ఈ టీజర్‌లో యశ్ కొన్ని అసభ్య పదాలు వాడాడు. గత టీజర్‌లో కార్ ఛేజింగ్ సీన్ సంచలనం సృష్టిస్తే, ఈసారి యశ్ వాడిన భాష అందరినీ ఆశ్చర్యపరిచింది.

యష్ ‘టాక్సిక్’ టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.