|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడి అనుమానాస్పద మృతి

Published: 13-12-2025, 11:08 PM
మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడి అనుమానాస్పద మృతి
  • ప్రముఖ హాలీవుడ్ నటుడు పీటర్ గ్రీన్ (60) అనుమానాస్పద స్థితిలో మృతి.
  • న్యూయార్క్‌లోని అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా లభ్యం, రక్తపు మడుగులో కనిపించారు.
  • పోలీసులు అనుమానాస్పద ఆధారాలు గుర్తించలేదు; మృతిపై సస్పెన్స్.
  • ‘పల్ప్ ఫిక్షన్’, ‘ది మాస్క్’ వంటి చిత్రాలతో పీటర్ గ్రీన్ ప్రపంచ ప్రఖ్యాతి.

హాలీవుడ్ చిత్రాలైన ‘పల్ప్ ఫిక్షన్’, ‘ది మాస్క్’ చిత్రాల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు పీటర్ గ్రీన్ (60) అనుమానాస్పద రీతిలో మరణించడం తీవ్ర విషాదం నింపింది. న్యూయార్క్‌లో ఆయన అపార్ట్‌మెంట్‌లో మృతదేహం లభ్యం కావడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

పీటర్ గ్రీన్ మరణం: కారణాలపై సస్పెన్స్

ప్రముఖ హాలీవుడ్ చిత్రాలైన ‘పల్ప్ ఫిక్షన్’, ‘ది మాస్క్’లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు పీటర్ గ్రీన్ (Peter Green) (60) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ 12న న్యూయార్క్‌ (New York)లోని లోయర్ ఈస్ట్ సైడ్‌లో ఆయన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. పీటర్ గ్రీన్ మరణాన్ని ఆయన మేనేజర్ గ్రెగ్ ఎడ్వర్డ్స్ (Greg Edwards) కూడా ధృవీకరించారు. పొరుగు వారు అపార్ట్‌మెంట్‌లో గురువారం నుంచి క్రిస్మస్ సంగీతం గట్టిగా వినిపిస్తూ ఉండటంతో పోలీసులకు సమాచారం అందజేశారు. తలుపు తెరిచి చూడగా పీటర్ గ్రీన్ రక్తపు మడుగులో బోర్లా పడి ఉన్నాడని.. అయితే, గదితో ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు పీటర్ గ్రీన్ మరణంపై సస్పెన్స్ వీడలేదు. న్యూయార్క్ మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్‌ (New York Medical Examiner’s Office)లో పోస్టు‌మార్టం నిర్వహించిన తర్వాత వచ్చిన రిపోర్టు ఆధారంగా ఆయన ఎలా చనిపోయారనే విషయాన్ని బయటపెట్టనున్నారు.

కాగా, పీటర్ గ్రీన్ 1994లో వచ్చిన ‘పల్ప్ ఫిక్షన్’లో జెడ్ పాత్ర, ‘ది మాస్క్’లో డోరియన్ టైరెల్ పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ‘ది యూజువల్ సస్పెక్ట్స్’, ‘ట్రైనింగ్ డే’ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టిన విషయం తెలిసిందే.

పోలీసుల దర్యాప్తు, అనుమానాస్పద ఆధారాలు

పీటర్ గ్రీన్ సినీ ప్రస్థానం, ప్రముఖ పాత్రలు

పీటర్ గ్రీన్ మృతితో హాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే అసలు నిజం బయటపడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.